-
మార్కు 15:2-5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
2 అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని యేసును అడిగాడు.+ అందుకు ఆయన, “నువ్వే స్వయంగా ఆ మాట అంటున్నావు కదా” అన్నాడు.+ 3 కానీ ముఖ్య యాజకులు ఆయన మీద ఎన్నో తప్పులు ఆరోపించారు. 4 పిలాతు మళ్లీ ఆయన్ని ప్రశ్నిస్తూ, “నువ్వేమీ మాట్లాడవా?+ వాళ్లు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు”+ అన్నాడు. 5 కానీ యేసు మాత్రం ఇంకేమీ మాట్లాడలేదు, దాంతో పిలాతుకు చాలా ఆశ్చర్యమేసింది.+
-