కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 27:33-37
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 33 వాళ్లు గొల్గొతా అనే చోటుకు వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థం.+ 34 అక్కడ వాళ్లు ఆయనకు చేదు మొక్కలు కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చారు;+ కానీ ఆయన దాన్ని రుచి చూశాక, దాన్ని తాగడానికి నిరాకరించాడు. 35 వాళ్లు ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టి, చీట్లు* వేసి ఆయన పైవస్త్రాల్ని పంచుకున్నారు.+ 36 తర్వాత వాళ్లు ఆయనకు కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నారు. 37 అంతేకాదు, ఆయన మీద మోపిన నేరాన్ని అంటే “ఇతను యూదుల రాజైన యేసు” అనే మాటల్ని పలకమీద రాసి, దాన్ని ఆయన తలకు పైన కొయ్య మీద పెట్టారు.+

  • లూకా 23:33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 33 వాళ్లు “కపాలం” అనే చోటికి వచ్చినప్పుడు,+ యేసును మేకులతో కొయ్యకు దిగగొట్టి ఆ ఇద్దరు నేరస్తుల మధ్య వేలాడదీశారు. ఒకతన్ని యేసుకు కుడివైపున, ఇంకొకతన్ని యేసుకు ఎడమవైపున వేలాడదీశారు.+

  • యోహాను 19:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 యేసే స్వయంగా హింసాకొయ్యను* మోసుకుంటూ, “కపాల స్థలం” అనబడిన చోటికి వెళ్లాడు.+ హీబ్రూ భాషలో దాన్ని గొల్గొతా అని పిలుస్తారు.+

  • హెబ్రీయులు 13:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 కాబట్టి యేసు కూడా తన సొంత రక్తంతో ప్రజల్ని పవిత్రపర్చడానికి,+ నగర ద్వారం బయట బాధలు అనుభవించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి