-
మత్తయి 9:23-26పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
23 యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినప్పుడు, పిల్లనగ్రోవి* ఊదేవాళ్లను, పెద్దగా ఏడుస్తున్న ప్రజల్ని చూసి,+ 24 “ఇక్కడి నుండి వెళ్లండి. పాప చనిపోలేదు, నిద్రపోతోంది అంతే” అన్నాడు.+ ఆ మాట విన్నప్పుడు వాళ్లు వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు. 25 వాళ్లు వెళ్లిపోగానే యేసు లోపలికి వెళ్లి ఆ పాప చేతిని పట్టుకున్నాడు,+ దాంతో ఆమె లేచి కూర్చుంది.+ 26 ఈ విషయం గురించి ఆ ప్రాంతమంతా తెలిసిపోయింది.
-
-
మార్కు 5:38-43పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
38 వాళ్లు సమాజమందిర అధికారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అంతా గోలగోలగా ఉండడం, ప్రజలు దుఃఖిస్తూ బోరున ఏడుస్తుండడం ఆయన గమనించాడు.+ 39 ఆయన లోపలికి వెళ్లి వాళ్లతో, “మీరెందుకు ఏడుస్తున్నారు? ఎందుకు గోల చేస్తున్నారు? పాప చనిపోలేదు, నిద్రపోతోంది అంతే” అన్నాడు.+ 40 ఆ మాట వినగానే వాళ్లు ఆయన్ని చూసి వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆయన వాళ్లందర్నీ బయటికి పంపించేసి, పాప తల్లిదండ్రుల్ని, తనతో ఉన్నవాళ్లను తీసుకొని పాప ఉన్న గదిలోకి వెళ్లాడు. 41 తర్వాత ఆయన పాప చెయ్యి పట్టుకొని, “తలీతా కుమీ” అన్నాడు. ఆ మాటను అనువదిస్తే, “పాపా, నీతో చెప్తున్నాను, లే!” అని అర్థం.+ 42 వెంటనే పాప లేచి నడిచింది. (ఆమెకు 12 ఏళ్లు.) అది చూసి ఆమె తల్లిదండ్రులు ఆనందం పట్టలేకపోయారు. 43 కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని ఆయన వాళ్లకు మరీమరీ చెప్పాడు,*+ తినడానికి పాపకు ఏమైనా పెట్టమని కూడా చెప్పాడు.
-