21 అప్పుడు యేసు అతనితో, “నువ్వు పరిపూర్ణుడివి* అవ్వాలనుకుంటే, వెళ్లి నీకు ఉన్నవన్నీ అమ్మేసి, ఆ డబ్బును పేదవాళ్లకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు ఐశ్వర్యం కలుగుతుంది;+ నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అని అన్నాడు.+
22 ఆ మాట విన్నాక యేసు అతనితో, “నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది: నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి, ఆ డబ్బును పేదవాళ్లకు పంచిపెట్టు. అప్పుడు పరలోకంలో నీకు ఐశ్వర్యం కలుగుతుంది. నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు.+
34 నిజానికి వాళ్లలో ఎవరికీ లోటు ఉండేది కాదు.+ ఎందుకంటే పొలాలు, ఇళ్లు ఉన్నవాళ్లందరూ వాటిని అమ్మి, వచ్చిన డబ్బును 35 అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్లు.+ అపొస్తలులు ఆ డబ్బును ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల అవసరాన్ని బట్టి పంచేవాళ్లు.+