కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 22:16-18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 నా శత్రువులు కుక్కల్లా నన్ను చుట్టుముట్టారు;+

      కీడు చేసేవాళ్ల గుంపు నా మీదికి వస్తోంది,+

      వాళ్లు సింహంలా నా చేతులను, కాళ్లను కొరుకుతున్నారు.+

      17 నేను నా ఎముకలన్నీ లెక్కపెట్టగలను.+

      వాళ్లు నన్ను అదేపనిగా తేరి చూస్తున్నారు.

      18 వాళ్లు నా వస్త్రాలు పంచుకుంటున్నారు,

      నా వస్త్రాల కోసం చీట్లు* వేసుకుంటున్నారు.+

  • యెషయా 53:7-9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 ఆయన అణచివేయబడ్డాడు,+ కష్టాలన్నీ భరించాడు,+

      అయినా ఆయన నోరు తెరవలేదు.

      వధించడానికి గొర్రెను తీసుకొచ్చినట్టు ఆయన్ని తీసుకొచ్చారు,+

      బొచ్చు కత్తిరించే వాళ్లముందు ఆడగొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు,

      ఆయన నోరు తెరవలేదు.+

       8 అన్యాయపు తీర్పు తీర్చి* ఆయన్ని తీసుకెళ్లిపోయారు;

      ఆయన తరానికి* సంబంధించిన వివరాల గురించి ఎవరు ఆలోచిస్తారు?

      ఎందుకంటే సజీవుల దేశం నుండి ఆయన కొట్టివేయబడ్డాడు;+

      నా ప్రజల దోషం వల్ల ఆయన కొట్టబడ్డాడు.*+

       9 ఆయన ఏ తప్పూ* చేయకపోయినా,

      ఆయన నోట ఎలాంటి మోసం లేకపోయినా,+

      ఆయన చనిపోయినప్పుడు దుష్టులతో పాటు ఆయన్ని సమాధి చేశారు,*+

      ఆయన ధనవంతుల* దగ్గర సమాధి చేయబడ్డాడు.+

  • 1 కొరింథీయులు 15:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 నేను అందుకున్న దాన్నే మీకు బోధించాను, అది అత్యంత ప్రాముఖ్యమైనది. అదేమిటంటే, లేఖనాలు చెప్పినట్టే క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు;+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి