4 అయితే దేవుడు అత్యంత కరుణామయుడు,+ ఆయనకు మనమీద ఉన్న ప్రేమ ఎంతో గొప్పది+ కాబట్టి, 5 పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతోపాటు బ్రతికించాడు.+ దేవుని అపారదయ వల్లే మీరు రక్షణ పొందారు.
18 ఎందుకంటే అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు+ అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే చనిపోయాడు. పాపాల్ని తీసేయడానికి, మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి ఆయన అలా చనిపోయాడు.+ ఆయన మానవ శరీరంతో చనిపోయాడు, కానీ పరలోక సంబంధమైన శరీరంతో బ్రతికించబడ్డాడు.+