-
ఎఫెసీయులు 6:14-17పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
14 కాబట్టి మీరు నడుముకు సత్యం అనే దట్టీ కట్టుకుని,+ ఛాతికి నీతి అనే కవచం తొడుక్కుని+ స్థిరంగా నిలబడండి; 15 మీ పాదాలకు, శాంతి సువార్త ప్రకటించడం కోసం సంసిద్ధత అనే చెప్పులు వేసుకోండి.+ 16 వీటన్నిటితో పాటు విశ్వాసం అనే పెద్ద డాలు పట్టుకోండి,+ దానితో మీరు దుష్టుడి అగ్ని బాణాలన్నీ* ఆర్పేయగలుగుతారు.+ 17 అంతేకాదు, మీ తలకు రక్షణ అనే శిరస్త్రాణం* పెట్టుకోండి,+ పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోండి.+
-