-
ఎఫెసీయులు 4:17-19పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
17 కాబట్టి ప్రభువు పేరున నేను మీకు చెప్పేది, మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరిక అన్యజనుల్లా అర్థంపర్థంలేని* ఆలోచనల+ ప్రకారం నడుచుకోకండి.+ 18 తమ అజ్ఞానం వల్ల, మొద్దుబారిన హృదయాల వల్ల వాళ్లు* చీకట్లో ఉన్నారు, దేవుడు ఇస్తానన్న శాశ్వత జీవితానికి దూరంగా ఉన్నారు. 19 వాళ్లు నైతిక విచక్షణను పూర్తిగా కోల్పోయి, అత్యాశతో అన్నిరకాల అపవిత్రమైన పనులు చేస్తూ లెక్కలేనితనంలో*+ మునిగిపోయారు.
-