యెషయా
10 హానికరమైన నియమాల్ని రూపొందించే వాళ్లకు+ శ్రమ,
అదేపనిగా అణచివేసే చట్టాల్ని తయారుచేసే వాళ్లకు శ్రమ.
2 అలా వాళ్లు పేదవాళ్ల వ్యాజ్యాన్ని తృణీకరిస్తారు,
నా ప్రజల్లో దీనులకు న్యాయం జరగకుండా చేస్తారు;+
వాళ్లు విధవరాళ్లను దోపుడుసొమ్ముగా,
3 మరైతే లెక్క అప్పజెప్పాల్సిన* రోజున,+
మీ సంపదను* ఎక్కడ విడిచివెళ్తారు?
4 ఖైదీల మధ్య దాక్కోవడం,
హతులైనవాళ్ల మధ్య పడిపోవడం తప్ప ఇంకేమీ చేయలేరు.
ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,
వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.+
అది నా కోపాన్ని చూపించే కర్ర,+
వాళ్ల చేతిలో ఉన్న దండం నా ఉగ్రతను వెళ్లగక్కుతుంది!
6 మతభ్రష్ట జనం మీదికి,
నాకు విపరీతమైన కోపం తెప్పించిన జనం మీదికి నేను అతన్ని పంపిస్తాను;+
విస్తారమైన కొల్లసొమ్మును, విస్తారమైన దోపుడుసొమ్మును తీసుకోమని,
వీధుల్లో మట్టిని తొక్కినట్టు వాళ్లను తొక్కమని నేను అతనికి ఆజ్ఞాపిస్తాను.+
7 కానీ అతని ధ్యాస దీనిమీద ఉండదు,
అతని హృదయం ఈ విధంగా పన్నాగం పన్నదు;
కొన్ని జనాల్ని కాదు అనేక జనాల్ని సమూలంగా నాశనం చేయాలి,
వాటిని నిర్మూలించాలి అనే ఆలోచన అతని హృదయంలో ఉంది.
9 కల్నో+ కర్కెమీషు+ లాంటిది కాదా?
10 వ్యర్థమైన దేవుళ్లను పూజించే రాజ్యాలు నా చేతికి చిక్కాయి;
యెరూషలేములో, సమరయలో కన్నా ఎక్కువ విగ్రహాలు* వాళ్ల దగ్గర ఉన్నాయి!+
11 నేను సమరయకు, దాని వ్యర్థమైన దేవుళ్లకు చేసినట్టే
యెరూషలేముకు, దాని విగ్రహాలకు చేయలేనా?’+
12 “సీయోను పర్వతం మీద, యెరూషలేములో యెహోవా తన పనంతటినీ పూర్తిచేసినప్పుడు, ఆయన* అష్షూరు రాజును శిక్షిస్తాడు; అతని హృదయ గర్వాన్ని బట్టి, అహంకారంతో నిండిన అతని పొగరుబోతు చూపును బట్టి+ అతన్ని శిక్షిస్తాడు. 13 ఎందుకంటే అతను ఇలా అంటున్నాడు,
‘నేను నా చేతి బలంతో దీన్ని చేస్తాను,
నేను తెలివిగలవాణ్ణి కాబట్టి నా తెలివితో దీన్ని చేస్తాను.
నేను జనాల సరిహద్దుల్ని చెరిపేస్తాను,+
వాళ్ల సంపదల్ని కొల్లగొడతాను,+
బలవంతుడిలా వాటి నివాసుల్ని లోబర్చుకుంటాను.+
14 ఒక వ్యక్తి పక్షి గూటిలో చెయ్యి పెట్టినట్టు
నేను నా చేతితో జనాల వనరుల్ని పట్టుకుంటాను;
వదిలేసిన గుడ్లను పోగుచేసినట్టు
భూమంతటినీ పోగుచేస్తాను!
ఎవరూ రెక్కలు ఆడించరు, నోరు తెరవరు, కిచకిచలాడరు.’ ”
15 గొడ్డలి, తనతో నరికేవాడి కన్నా తానే గొప్ప అనుకుంటుందా?
రంపం, తనతో కోసేవాడి కన్నా తానే గొప్ప అనుకుంటుందా?
దండం,+ తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలదా?
కర్ర, తనను ఉపయోగించేవాణ్ణి పైకి లేపగలదా?
16 కాబట్టి నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా
అతని ప్రజల్లో కొవ్వుపట్టినవాళ్లను కృశించిపోయేలా చేస్తాడు,+
అతని మహిమ కింద, మండుతూ ఉండే అగ్నిని రగిలిస్తాడు.+
17 ఇశ్రాయేలు వెలుగు+ అగ్ని అవుతుంది,+
పవిత్రుడైన అతని దేవుడు జ్వాల అవుతాడు;
అది రగులుకొని, ఒక్కరోజులో అతని పిచ్చిచెట్లను, ముళ్లపొదల్ని దహించేస్తుంది.
18 అతని అడవి శోభను, పండ్లతోట శోభను ఆయన పూర్తిగా తీసేస్తాడు;
రోగి క్షీణించిపోయినట్టు అది క్షీణించిపోతుంది.+
19 అతని అడవిలో మిగిలే చెట్లు ఎంత తక్కువగా ఉంటాయంటే,
ఒక పిల్లవాడు వాటి సంఖ్యను రాయగలుగుతాడు.
20 ఆ రోజు ఇశ్రాయేలులో మిగిలినవాళ్లు,
యాకోబు ఇంటివాళ్లలో తప్పించుకున్నవాళ్లు
ఇక తమమీద దాడి చేసినవాని మీద ఆధారపడరు;+
కానీ వాళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుడైన యెహోవా మీద
నిజాయితీగా ఆధారపడతారు.
21 శేషం మాత్రమే, అంటే యాకోబు వంశస్థుల్లో మిగిలినవాళ్లు మాత్రమే
శక్తిమంతుడైన దేవుని దగ్గరికి తిరిగొస్తారు.+
23 అవును, సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా నిర్ణయించిన సమూలనాశనం
దేశమంతటి మీదికి వస్తుంది.+
24 కాబట్టి సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు: “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, మిమ్మల్ని కర్రతో శిక్షించి ఐగుప్తులా+ మీ మీద తన దండం ఎత్తిన అష్షూరును+ చూసి భయపడకండి. 25 ఎందుకంటే అతిత్వరలోనే ఉగ్రత తీరిపోతుంది, వాళ్లను నాశనం చేయడానికి నా కోపం వాళ్లమీదికి మళ్లుతుంది.+ 26 సైన్యాలకు అధిపతైన యెహోవా ఓరేబు బండరాయి దగ్గర మిద్యానును ఓడించినప్పుడు+ చేసినట్టే అతని మీద కొరడా ఝళిపిస్తాడు.+ ఆయన దండం సముద్రం మీద ఉంటుంది, ఆయన ఐగుప్తు విషయంలో చేసినట్టు దాన్ని పైకెత్తుతాడు.+
27 ఆ రోజు, నీ భుజం మీది నుండి అతని బరువు,+
నీ మెడ మీది నుండి అతని కాడి దిగిపోతాయి;
తైలం వల్ల కాడి విరగ్గొట్టబడుతుంది.”+
29 వాళ్లు రేవును దాటారు;
గెబా+ దగ్గర రాత్రి గడుపుతారు;
రామా వణికిపోతుంది, సౌలు నగరమైన గిబియా+ పారిపోయింది.
30 గల్లీము కూతురా, అరువు, కేకలు వేయి!
లాయిషా, శ్రద్ధగా విను!
అయ్యో అనాతోతు!+
31 మద్మేనా పారిపోయింది.
గెబీము నివాసులు ఆశ్రయం కోసం వెతికారు.
32 ఈ రోజే అతను నోబులో+ ఆగుతాడు.
సీయోను కూతురి పర్వతం దగ్గర, యెరూషలేము కొండ దగ్గర
అతను తన పిడికిలి ఆడిస్తూ బెదిరిస్తాడు.
33 ఇదిగో! నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా
కొమ్మల్ని భయంకరమైన శబ్దంతో నరికేస్తున్నాడు;+
ఎత్తైన వృక్షాలు నరికేయబడుతున్నాయి,
గొప్పగొప్పవి నేలమట్టం చేయబడుతున్నాయి.
34 ఇనుప పనిముట్టుతో* ఆయన అడవిలోని దట్టమైన పొదల్ని నరికేస్తాడు,
లెబానోను శక్తిమంతుడి చేతిలో కూలుతుంది.