కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దానియేలు 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

దానియేలు విషయసూచిక

      • పొట్టేలు, మేకపోతు దర్శనం (1-14)

        • చిన్న కొమ్ము హెచ్చించుకోవడం (9-12)

        • 2,300 సాయంకాలాలు, పగళ్లు (14)

      • గబ్రియేలు దర్శన భావాన్ని చెప్పడం (15-27)

        • పొట్టేలు, మేకపోతు ఎవర్ని సూచిస్తు​న్నాయో వివరించడం (20, 21)

        • భీకరంగా కనిపించే రాజు లేస్తాడు (23-25)

దానియేలు 8:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 5:1, 30

దానియేలు 8:2

అధస్సూచీలు

  • *

    లేదా “సూస.”

  • *

    లేదా “రాజభవనంలో; దుర్గంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:22; యెష 11:11; 21:2
  • +నెహె 1:1; ఎస్తే 2:8

దానియేలు 8:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:17; దాని 7:5
  • +ఎస్తే 1:1, 3
  • +యెష 44:28

దానియేలు 8:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 45:1; యిర్మీ 51:12; దాని 5:30, 31

దానియేలు 8:5

అధస్సూచీలు

  • *

    లేదా “సూర్యాస్తమయం వైపు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:39; 7:6; 8:21
  • +దాని 11:3

దానియేలు 8:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆకాశపు నాలుగు గాలుల వైపుకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 8:22; 11:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ‘మంచి దేశము’, పేజీలు 26-27

దానియేలు 8:9

అధస్సూచీలు

  • *

    లేదా “సూర్యోదయం వైపు.”

  • *

    లేదా “ఆభరణం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 48:2; దాని 11:16, 45

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2007, పేజీ 20

దానియేలు 8:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 11:31; 12:11

దానియేలు 8:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 12:11

దానియేలు 8:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2001, పేజీ 28

    7/15/1997, పేజీలు 25-29

దానియేలు 8:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 8:2
  • +లూకా 1:19, 26
  • +దాని 9:21, 22

దానియేలు 8:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 10:14; 12:4, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 9/2017, పేజీ 1

దానియేలు 8:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 10:9, 10

దానియేలు 8:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 11:27

దానియేలు 8:20

అధస్సూచీలు

  • *

    లేదా “పర్షియా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 7:5; 8:3; 11:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2012, పేజీలు 10-11

దానియేలు 8:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 7:6
  • +దాని 8:5; 11:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2012, పేజీలు 10-11

    జ్ఞానము, పేజీ 18

దానియేలు 8:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 8:8; 11:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2012, పేజీలు 10-11

    జ్ఞానము, పేజీ 18

దానియేలు 8:23

అధస్సూచీలు

  • *

    లేదా “హద్దుకు చేరుకున్నప్పుడు.”

  • *

    లేదా “పన్నాగాలు పన్నడంలో నైపుణ్యం గలవాడు.”

దానియేలు 8:24

అధస్సూచీలు

  • *

    లేదా “అసాధారణ రీతిలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 7:25; 8:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2022, పేజీ 10

    కావలికోట,

    6/15/2012, పేజీ 16

దానియేలు 8:25

అధస్సూచీలు

  • *

    లేదా “హెచ్చరిక చేయకుండా” అయ్యుంటుంది.

  • *

    అక్ష., “చెయ్యి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2007, పేజీ 20

    11/1/1993, పేజీ 21

దానియేలు 8:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 10:14

దానియేలు 8:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 7:28; 10:16
  • +దాని 2:48, 49
  • +దాని 8:17

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

దాని. 8:1దాని 5:1, 30
దాని. 8:2ఆది 10:22; యెష 11:11; 21:2
దాని. 8:2నెహె 1:1; ఎస్తే 2:8
దాని. 8:3యెష 13:17; దాని 7:5
దాని. 8:3ఎస్తే 1:1, 3
దాని. 8:3యెష 44:28
దాని. 8:4యెష 45:1; యిర్మీ 51:12; దాని 5:30, 31
దాని. 8:5దాని 2:39; 7:6; 8:21
దాని. 8:5దాని 11:3
దాని. 8:8దాని 8:22; 11:4
దాని. 8:9కీర్త 48:2; దాని 11:16, 45
దాని. 8:11దాని 11:31; 12:11
దాని. 8:13దాని 12:11
దాని. 8:16దాని 8:2
దాని. 8:16లూకా 1:19, 26
దాని. 8:16దాని 9:21, 22
దాని. 8:17దాని 10:14; 12:4, 9
దాని. 8:18దాని 10:9, 10
దాని. 8:19దాని 11:27
దాని. 8:20దాని 7:5; 8:3; 11:2
దాని. 8:21దాని 7:6
దాని. 8:21దాని 8:5; 11:3
దాని. 8:22దాని 8:8; 11:4
దాని. 8:24దాని 7:25; 8:10
దాని. 8:26దాని 10:14
దాని. 8:27దాని 7:28; 10:16
దాని. 8:27దాని 2:48, 49
దాని. 8:27దాని 8:17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
దానియేలు 8:1-27

దానియేలు

8 బెల్షస్సరు రాజు+ పరిపాలన మూడో సంవత్సరంలో, దానియేలు అనే నేను ఇంకో దర్శనం చూశాను. 2 దర్శనం చూస్తున్నప్పుడు, నేను ఏలాము+ సంస్థానంలోని షూషను*+ కోటలో* ఉన్నాను; ఆ దర్శనంలో నేను ఊలయి కాలువ పక్కన ఉండడం చూశాను. 3 నేను తలెత్తి చూసినప్పుడు, ఇదిగో! ఒక పొట్టేలు+ ఆ కాలువ ఎదుట నిలబడివుంది, దానికి రెండు కొమ్ములు ఉన్నాయి.+ ఆ రెండు కొమ్ములు పొడుగ్గా ఉన్నాయి కానీ ఒక కొమ్ము మరో కొమ్ము కన్నా పొడుగ్గా ఉంది, పొడవైన కొమ్ము ఆ తర్వాత వచ్చింది.+ 4 ఆ పొట్టేలు పడమటి వైపుకు, ఉత్తరం వైపుకు, దక్షిణం వైపుకు పొడుస్తూ ఉండడం నేను చూశాను; దాని ముందు ఏ క్రూరమృగం కూడా నిలబడలేకపోయింది, దాని నుండి వాటిని రక్షించేవాళ్లెవ్వరూ లేరు.+ అది తనకు ఇష్టమొచ్చినట్టు చేస్తూ, తనను తాను హెచ్చించుకుంది.

5 నేను చూస్తుండగా, ఇదిగో! ఒక మేకపోతు+ పడమటి వైపు* నుండి వస్తూ ఉంది, అది నేల మీద కాలు మోపకుండా భూమంతా ప్రయాణిస్తూ ఉంది. ఆ మేకపోతు కళ్ల మధ్య స్పష్టంగా కనిపించే ఒక కొమ్ము ఉంది.+ 6 అది రెండు కొమ్ములుగల పొట్టేలు వైపు, అంటే కాలువ ఎదుట నిలబడివున్నట్టు నేను చూసిన పొట్టేలు వైపు వస్తూ ఉంది. అది విపరీతమైన కోపంతో దానివైపుకు పరుగెత్తుతూ ఉంది.

7 మేకపోతు పొట్టేలు దగ్గరికి రావడం నేను చూశాను, అది చాలా కోపంతో పొట్టేలు మీద దాడిచేసి దాని రెండు కొమ్ముల్ని విరగ్గొట్టింది; పొట్టేలు దాన్ని ఎదిరించలేకపోయింది. ఆ మేకపోతు పొట్టేలును నేలమీద పడేసి తొక్కేసింది, దాని నుండి పొట్టేలును రక్షించేవాళ్లెవ్వరూ లేరు.

8 అప్పుడు ఆ మేకపోతు తనను తాను చాలా ఎక్కువగా హెచ్చించుకుంది, అయితే దానికి ఎక్కువ బలం రాగానే దాని గొప్ప కొమ్ము విరిగిపోయింది; దాని స్థానంలో నాలుగు పెద్ద కొమ్ములు నాలుగు దిక్కులకు* పెరిగాయి.+

9 ఆ కొమ్ముల్లో ఒకదాని నుండి ఒక చిన్న కొమ్ము వచ్చింది; అది దక్షిణం వైపు, తూర్పు వైపు,* సుందరమైన దేశం*+ వైపు చాలా ఎక్కువగా పెరిగింది. 10 ఎంతగా పెరిగిందంటే, అది ఆకాశ సైన్యం వరకు చేరుకుంది; అది ఆ సైన్యంలో కొన్నిటిని, నక్షత్రాల్లో కొన్నిటిని భూమ్మీద పడిపోయేలా చేసి, వాటిని తొక్కేసింది. 11 అది చివరికి సైన్యాధిపతికి వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకుంది; ఆయన దగ్గర నుండి రోజువారీ బలులు తీసేయబడ్డాయి, అలాగే ఆయన స్థిరపర్చిన పవిత్రమైన స్థలం పడగొట్టబడింది.+ 12 అపరాధం కారణంగా సైన్యం అలాగే రోజువారీ బలులు ఆ కొమ్ముకు అప్పగించబడ్డాయి. ఆ కొమ్ము సత్యాన్ని భూమ్మీదికి పడేస్తూ ఉంది, అది తనకు ఇష్టమొచ్చినట్టు చేస్తూ విజయం సాధించింది.

13 తర్వాత ఒక పవిత్రుడు మాట్లాడడం నేను విన్నాను, అతన్ని మరో పవిత్రుడు ఇలా అడిగాడు: “రోజువారీ బలులకు, నాశనం కలిగించే అపరాధానికి సంబంధించిన ఆ దర్శనం ఎంతకాలం పాటు కొనసాగుతుంది?+ పవిత్ర స్థలం, సైన్యం రెండూ ఎంతకాలం తొక్కబడతాయి?” 14 దానికి అతను నాతో ఇలా చెప్పాడు: “2,300 సాయంకాలాలు, పగళ్ల పాటు; ఆ తర్వాత పవిత్ర స్థలం ఖచ్చితంగా మళ్లీ సరైన స్థితికి వస్తుంది.”

15 దానియేలు అనే నేను ఆ దర్శనం చూస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మనిషిలా ఉన్న ఒకతను ఉన్నట్టుండి నా ముందు నిలబడ్డాడు. 16 అప్పుడు ఊలయి+ మధ్యలో నేను ఒక మనిషి స్వరాన్ని విన్నాను; అతను గట్టిగా ఇలా అన్నాడు: “గబ్రియేలూ,+ అతను చూసిన వాటి అర్థం ఏంటో అతనికి వివరించు.”+ 17 కాబట్టి అతను నేను నిలబడివున్న చోటికి వచ్చాడు; అతను వచ్చినప్పుడు నేను చాలా భయపడి, సాష్టాంగపడ్డాను. అతను నాతో, “మానవ కుమారుడా, ఈ దర్శనం అంత్యకాలంలో నెరవేరుతుందని అర్థం చేసుకో” అన్నాడు.+ 18 అయితే అతను మాట్లాడుతుండగా, నేను నేలమీద ముఖం పెట్టి గాఢనిద్రలోకి వెళ్లిపోయాను. అతను నన్ను ముట్టుకుని, ఆ స్థలంలోనే నన్ను నిలబెట్టాడు.+ 19 తర్వాత అతను ఇలా అన్నాడు: “దేవుని ఉగ్రత కాలంలోని చివరి భాగంలో ఏం జరుగుతుందో నీకు తెలియజేస్తున్నాను, ఎందుకంటే అది నియమిత అంత్యకాలంలో జరుగుతుంది.+

20 “నువ్వు చూసిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలు మాదీయ, పారసీక* రాజుల్ని సూచిస్తుంది.+ 21 బొచ్చుగల ఆ మేకపోతు గ్రీసు రాజును సూచిస్తుంది;+ దాని కళ్ల మధ్య ఉన్న గొప్ప కొమ్ము గ్రీసు మొదటి రాజును సూచిస్తుంది.+ 22 ఆ కొమ్ము విరిగిపోయి, దాని స్థానంలో నాలుగు కొమ్ములు వచ్చాయి కదా;+ అదేవిధంగా అతని దేశంలో నుండి నాలుగు రాజ్యాలు లేస్తాయి, అయితే అతనికి ఉన్నలాంటి శక్తి వాటికి ఉండదు.

23 “వాళ్ల రాజ్యం చివరి రోజుల్లో, వాళ్ల అపరాధాలు సంపూర్తి అయినప్పుడు* భీకరంగా కనిపించే ఒక రాజు లేస్తాడు, అతను చిక్కు ప్రశ్నల్ని అర్థం చేసుకోగలడు.* 24 అతను ఎంతో శక్తిమంతుడు అవుతాడు, కానీ తన సొంత శక్తితో కాదు. అతను ఘోరంగా* నాశనం కలగజేస్తాడు, అతను తాను చేసే దానిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అతను బలంగలవాళ్లను, అలాగే పవిత్ర ప్రజల్ని నాశనం చేస్తాడు.+ 25 అతను చాలామందిని మోసం చేయడంలో తప్పకుండా విజయం సాధిస్తాడు; అతను తన హృదయంలో తనను తాను హెచ్చించుకుంటాడు; సురక్షితంగా ఉన్న సమయంలో* అతను చాలామందిని నాశనం చేస్తాడు. చివరికి అతను అధిపతుల అధిపతికి వ్యతిరేకంగా నిలబడతాడు, కానీ మనిషి ప్రమేయం* లేకుండానే అతను విరగ్గొట్టబడతాడు.

26 “సాయంకాలాల గురించి, పగళ్ల గురించి దర్శనంలో చెప్పబడిన మాటలు సత్యం; కానీ నువ్వు ఆ దర్శనాన్ని రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే అది సుదూర భవిష్యత్తుకు సంబంధించినది.”+

27 దానియేలునైన నేను బాగా అలసిపోయాను, చాలా రోజులపాటు అనారోగ్యంగా ఉన్నాను.+ తర్వాత నేను లేచి రాజు సేవలో కొనసాగాను;+ అయితే నేను చూసిన దాన్నిబట్టి చాలా ఆశ్చర్యపోయాను, ఆ దర్శనాన్ని అర్థం చేసుకునే వాళ్లెవ్వరూ లేరు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి