కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 8/8 పేజీలు 20-21
  • గర్విష్టిగా ఉండటం తప్పా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గర్విష్టిగా ఉండటం తప్పా?
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • హాని కలిగించే గర్వం
  • న్యాయసమ్మతమైన గర్వం ఉందా?
  • గర్వానికి చెల్లించవలసిన మూల్యం—ఎంతెక్కువ?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మీరు సాతానుతో పోరాడి—గెలవగలరు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • జాత్యాభిమానం విషయమేమిటి?
    తేజరిల్లు!—1998
  • వినయం—బలహీనతా లేక బలమా?
    తేజరిల్లు!—2007
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 8/8 పేజీలు 20-21

బైబిలు ఉద్దేశము

గర్విష్టిగా ఉండటం తప్పా?

మరణకరమైన ఏడు పాపాల్లో గర్వం మొదటిదని ఒక లోకోక్తి చెబుతుంది. అయితే, అటువంటి తలంపుకు కాలం చెల్లిపోయిందని, ఈనాడు అనేకులు భావిస్తారు. 21వ శతాబ్దంలోకి అడుగుపెడుతుండగా, గర్వం ఒక పాపంగా కాదుగానీ, అది ఒక ఆస్తిగా దృష్టించబడుతుంది.

అయితే, బైబిలు గర్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా ప్రతికూల భావాన్నే సూచిస్తుంది. బైబిలు పుస్తకమైన సామెతల్లోనే, గర్వాన్ని ఖండించే అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఉదాహరణకు, “గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు” అని సామెతలు 8:13 చెబుతుంది. అలాగే, “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు” అని సామెతలు 16:5 చెబుతుంది. “నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును” అని 18వ వచనం హెచ్చరిస్తుంది.

హాని కలిగించే గర్వం

బైబిలు ఖండించే గర్వం మితిమీరిన ఆత్మాభిమానంగానూ, తన సామర్థ్యాలు, అందం, ఐశ్వర్యం, విద్య, స్థానంవంటి వాటిని బట్టి తాను అధికుడినన్న నిర్హేతుకమైన అనుభూతిగానూ నిర్వచించబడింది. తిరస్కారంగా ప్రవర్తించడంలోనూ, గొప్పలు చెప్పుకోవడంలోనూ, గౌరవం లేకుండా ప్రవర్తించడంలోనూ, లేదా వాళ్ళ అహంభావంలోనూ ఇది కనిపించవచ్చు. తన గురించి తాను అధికంగా తలంచడం అవసరమైన దిద్దుబాటును అంగీకరించడంలో విఫలమవ్వడానికి దారితీయవచ్చు; తప్పును ఒప్పుకోవడాన్ని, క్షమాపణను కోరడాన్ని నిరాకరించడానికి, తనకున్న స్థానం నుండి దిగిపోవడానికి, తనకున్న ప్రతిష్ఠను కోల్పోవడానికి దారితీయవచ్చు; లేదా ఎవరైనా చేసిన దానికో లేదా చెప్పిన దానికో నిర్హేతుకంగా కక్ష గట్టడానికి దారితీయవచ్చు.

గర్విష్టులు, కార్యాలు ఎల్లప్పుడూ తాము అనుకునే రీతిలోనే జరగాలని లేదా మొత్తానికే జరగకూడదని పట్టుపట్టవచ్చు. గానీ ఇటువంటి దృక్పథాల ఫలితంగా ఒక రీతిలో గానీ, మరో రీతిలో గానీ, తరచుగా వ్యక్తిగత సంఘర్షణలు కలుగుతాయని గ్రహించడం కష్టమేమీ కాదు. జాతి గర్వం, జాతీయతా గర్వం లెక్కలేనన్ని యుద్ధాలకు, రక్తపాతాలకూ నడిపించాయి. బైబిలు చెబుతున్న ప్రకారం, దేవుని ఆత్మ కుమారుడు తిరుగుబాటుదారుడిగా, తనను తాను అపవాదియైన సాతానుగా చేసుకోవడానికి నడిపించినది గర్వమే. క్రైస్తవ పెద్దల యోగ్యతల గురించి చెబుతూ, “గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు” అని పౌలు సలహా ఇచ్చాడు. (1 తిమోతి 3:6; పోల్చండి యెహెజ్కేలు 28:13-17.) గర్వం యొక్క ఫలితాలు ఇవే అయితే, దేవుడు దానిని ఖండించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే, ‘గర్వం న్యాయసమ్మతమైనదిగా కాగల సందర్భాలు లేవా?’ అని మీరు అడగవచ్చు.

న్యాయసమ్మతమైన గర్వం ఉందా?

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కావ్‌కావోమ్‌ అనే క్రియాపదం “గర్వించడం, ఉప్పొంగడం, గొప్పలు చెప్పుకోవడం” అని అనువదించబడింది. ఈ క్రియా పదాన్ని అనుకూల భావంలోనూ, వ్యతిరేక భావంలోనూ ఉపయోగిస్తారు. ఉదాహరణకు, “దేవుని మహిమను గూర్చిన నిరీక్షణబట్టి అతిశయపడుచున్నాము” అని పౌలు అంటున్నాడు. “అతిశయంచువాడు ప్రభువునందే అతిశయంపవలెను” అని కూడా ఆయన సిఫారసు చేస్తున్నాడు. (రోమీయులు 5:2; 2 కొరింథీయులు 10:17) మన దేవుడు యెహోవా అని గర్వించడమని దీనర్థం, ఈ భావోద్వేగం ఆయన మంచి పేరును, ఖ్యాతిని బట్టి ఆనందించడానికి నడిపించగలదు.

ఉదాహరణకు: ఒక మంచిపేరు అపఖ్యాతిపాలైనప్పుడు, దాని తరపున మాట్లాడటం తప్పా? ఎంత మాత్రం కాదు. ప్రజలు మీ కుటుంబ సభ్యులను గురించి లేదా మీరు ప్రేమిస్తున్న, గౌరవిస్తున్న ఇతరులను గురించి అన్యాయంగా మాట్లాడినట్లయితే, మీకు కోపం రాదా, వారి తరపున మాట్లాడటానికి పురికొల్పబడరా? “గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరు . . . కోరదగిన[ది],” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 22:1) “నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని” అని ఒక సందర్భంలో, ఐగుప్తీయుడైన గర్విష్టియైన ఫరోతో సర్వశక్తిమంతుడగు దేవుడు చెప్పాడు. (నిర్గమకాండము 9:16) కాబట్టి, దేవుడు తన సొంత మంచిపేరును, ఖ్యాతిని బట్టి సంతోషిస్తాడు, దాని పట్ల ఆయన ఉత్సుకతను కలిగి ఉన్నాడు. మనం కూడా మన సొంత పేరును, ఖ్యాతిని కాపాడుకోవడంలో ఆసక్తిని కలిగి ఉండగలం, అయితే దానికి ప్రేరకం వ్యర్థతగానీ, స్వార్థపూరిత గర్వం గానీ కాకూడదు.—సామెతలు 16:18.

ఆరోగ్యకరమైన ఏ సంబంధానికైనా గౌరవం ఆవశ్యకం. మన సహవాసుల మీద మనకున్న నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మన సామాజిక జీవితం, వ్యాపార వ్యవహారాలు బాధించబడతాయి. అదే విధంగా, భాగస్వాముల్లో ఒకరు తనకు లేదా తన తోటివారికి సమాజంలో అపకీర్తిని తెచ్చేలా ఏదైనా చేస్తే వాళ్ళ ఉమ్మడి కార్యకలాపం లేదా భాగస్వామ్యం దెబ్బతినవచ్చు. లక్ష్యాలను చేరుకోవడానికి, అవి ఏ లక్ష్యాలైనప్పటికీ, పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకోవలసిందే. క్రైస్తవ సంఘంలోని పైవిచారణకర్తలు బయటివారి నుండి “మంచి సాక్ష్యం” తప్పకుండా పొందాలనడానికి ఇది ఒక కారణం. (1 తిమోతి 3:7) మంచి పేరును సంపాదించాలని కోరుకునేందుకు వారిని పురికొల్పేది, తమను తాము గర్వంతో హెచ్చించుకోవాలన్న కోరిక కాదుగానీ, తగిన విధంగా, గౌరవప్రదమైన విధంగా దేవునికి ప్రాతినిధ్యం వహించవలసిన అవసరముందన్నదే. అంతెందుకు, ఒక పరిచారకుడు బయటివారి నుండి ప్రతికూల సాక్ష్యాన్నే సంపాదించినట్లయితే, ఆయనను ఎంత మేరకు నమ్మవచ్చు?

వ్యక్తిగతంగా సాధించే విజయాల విషయంలో గర్వించే విషయం ఏమిటి? ఉదాహరణకు, తమ పిల్లలు పాఠశాలలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రులకు కలగగల ఆహ్లాదానుభూతినే తీసుకోండి. అటువంటి సాఫల్యం సంతృప్తికి కారణమౌతుంది. థెస్సలొనీకలోని తన తోటి క్రైస్తవులకు వ్రాస్తూ, వారు సాధించిన విషయాలకు తాను కూడా సంతోషిస్తున్నానని తెలియజేస్తూ, “సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము” అని పౌలు వ్రాశాడు. (ఇటాలిక్కులు మావి.) (2 థెస్సలొనీకయులు 1:3, 4) అవును, ప్రియమైన వారు సాధించిన విషయాలను బట్టి ఆహ్లాదాన్ని పొందడం సహజ ప్రవృత్తే. అయితే, చెడ్డ గర్వానికి, మంచి గర్వానికి ఉన్న తేడా ఏమిటి?

సఫలులయ్యేందుకు, అలాంటి సాఫల్యాలను బట్టి సంతోషంగా ఉండేందుకు మన వ్యక్తిగత కీర్తిని నిలబెట్టుకోవాలనుకోవడం అనుచితమైనదేమీ కాదు. అయితే, తనను తాను హెచ్చించుకోవడాన్ని, అహంకారాన్ని, తన గురించి లేదా ఇతరుల గురించి గొప్పలు చెప్పుకోవడాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. నిజానికి, గర్వంతో ‘ఉప్పొంగడం’, లేదా ‘తమను తాము ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకోవడం’ విచారకరమైన విషయం. క్రైస్తవులు ఎవరి విషయంలోనైనా లేదా దేని విషయంలోనైనా గర్వించడానికి, డంభాన్ని ప్రదర్శించడానికి అవకాశం లేదు, కానీ యెహోవా దేవుని విషయమై, ఆయన తమ నిమిత్తమై చేసిన వాటి విషయమై గర్వించాలి. (1 కొరింథీయులు 4:6, 7; రోమీయులు 12:3) మనం పాటించేందుకుగాను, “అతిశయంచువాడు దేనినిబట్టి అతిశయంపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయంపవలెను” అనే శ్రేష్ఠమైన సూత్రాన్ని ప్రవక్త అయిన యిర్మీయా ఇస్తున్నాడు.—యిర్మీయా 9:24.

[20వ పేజీలోని చిత్రం]

“పోప్‌ ఇన్నోసెంట్‌ X,” డాన్‌ డీగో రోడ్రిగజ్‌ డీ సిల్వా వెలేజ్క్వెజ్‌ వేసిన చిత్రం

[క్రెడిట్‌ లైను]

Scala/Art Resource, NY

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి