కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 8/1 పేజీలు 14-19
  • ఒక పరిశుద్ధ మర్మము వెల్లడియగుచున్నది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక పరిశుద్ధ మర్మము వెల్లడియగుచున్నది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మర్మమును పరిష్కరించుట
  • ఆరు ముఖరూపములు
  • “సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను”
  • ఇతర ముఖరూపములు
  • దైవభక్తిని గూర్చిన పరిశుద్ధమర్మమును నేర్చుకొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • మీరు ఇతరులకు చెప్పగలిగే ఒక రహస్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • యేసుయొక్క దైవభక్తి మాదిరిని అనుసరించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • క్రైస్తవులు దాయకూడని ఓ రహస్యం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 8/1 పేజీలు 14-19

ఒక పరిశుద్ధ మర్మము వెల్లడియగుచున్నది

“దైవభక్తిని గూర్చిన మర్మము గెప్పదైయున్నది.”—1 తిమోతి 3:16.

1. మొదటి తిమోతి 3:16లో ఏ మర్మము వివరించబడినది?

మర్మములు నిన్ను కలవరపరచునా? రహస్యములను వెదికి పట్టుకొనుటను నీవు ఆనందించెదవా? మనలో అనేకులు దానికి అవునందురు. అట్లయిన వేల సంవత్సరములకొలది దేవునివాక్యములో గుప్తమైయున్న అన్నిటికంటే మహత్యమైన మర్మమును పరిశీలించుటలో మాతో కూడిరండి. ఈ పరిశుద్ధమర్మము మనజీవితములను ఇప్పుడు మరియు భవిష్యత్తులో గొప్పగా ప్రభావితము చేయును. అది 1 తిమోతి 3:16లో వర్ణించినరీతిగా ‘దైవభక్తిని గూర్చిన (పరిశుద్ధ) మర్మము.’ “మర్మములను బయలుపరుచు” దేవుడైన యెహోవా, ఈ అత్యున్నతమైన మర్మమును మరియు దాని అర్థవివరణను కృపాసహితముగా మనకు తెలియజేసినందుకు ఆయనకు ఎంత కృతజ్ఞతగలవారమై యుండవలెను!—దానియేలు 2:28, 29.

2. (ఎ) ఒక పరిశుద్ధమర్మమును గూర్చి యెహోవా మొదటిసారిగా ఎప్పుడు చెప్పెను, అప్పుడు ఆయన ఏమి వాగ్ధానము చేసెను? (బి) ఏ ప్రశ్నలకు ఉత్తరము అవసరము?

2 సర్పము హవ్వను మోసపరచి, తిరుగుబాటులో ఆదాము ఆమెను అనుసరించిన తరువాత యెహోవా పరిశుద్ధమర్మమునుగూర్చి మొదట పలికెను. అప్పుడు దేవుడు “సంతానము” లేక పిల్లలు సర్పముయొక్క తలను చితక కొట్టునని వాగ్ధానముచేసెను. (ఆదికాండము 3:15) ఈ సంతానము ఎవరు? అతడు ఆ సర్పమును ఏవిధముగా జయించును? అతడు దేవుని సత్యవాదిత్వమును మరియు భూమినిగూర్చి ఆయన సంకల్పమును ఘనపరచునా?

3. ఆ సంతానముయొక్క గుర్తు మరియు కార్యమును గూర్చి దైవిక ప్రవచనములు ఎటువంటి కీలకములను ఇచ్చెను?

3 సమయము గడిచిన కొలది దైవిక ప్రవచనములు ఆ సంతానముయొక్క గుర్తును మరియు భవిష్యత్తులో ఆయన చేయనైయున్న కార్యమును గూర్చిన కీలకములను బయలు పరిచినవి. అతడు అబ్రాహాము సంతానమైయుండి, దావీదు రాజ్యమునకు వారసుడవును. మరియు సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడును. అతని పరిపాలనలో ‘సమాధానమునకు మితిలేకుండా దానికివృద్ధియు క్షేమమును కలుగును.’ (యెషయా 9:6, 7; ఆదికాండము 22:15-18; కీర్తన 89:35-37) అయితే రోమీయులు 16:25లో చెప్పినట్లుగా ఆ పరిశుద్ధమర్మము “అనాదినుండి రహస్యముగా ఉంచబడినది.”

మర్మమును పరిష్కరించుట

4. సాశ. 9లో పరిశుద్ధమర్మము ఎట్లు వెల్లడియగుటకు మొదలాయెను?

4 చివరికి నాలుగు వేల సంవత్సరముల తరువాత వెలుగు తేజరిల్లెను! ఏవిధంగా? సా.శ. 29లో యోహాను, నజరేయుడైన యేసుకు యోర్దాను నదిలో బాప్తిస్మము ఇచ్చినపుడు పరలోకమునుండి దేవునిస్వరము “ఈయన నాప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను” అని చెప్పెను. (మత్తయి 3:17) ఇదిగో! వాగ్ధానము చేయబడిన సంతానము చివరికి ఇక్కడ ఉన్నాడు! ఆ పరిశుద్ధమర్మము దాని మహత్యమైన రూపములతో, దైవభక్తి విషయముతో సహా వెల్లడియగుట మొదలాయెను.

5. “దైవభక్తి” అనగా నేమి, మరియు దానిని ప్రదర్శించువారి మీద అది ఎట్లు ప్రభావము చూపును?

5 “దైవభక్తి” అనగా ఏమని మనము అర్థము చేసుకొందుము? క్రైస్తవ గ్రీకులేఖనములలో ఈ పదము కేవలము 20మార్లు మాత్రమే ఉన్నది. అందులో సగముకంటే ఎక్కువ పౌలు తిమోతికి వ్రాసిన రెండు పత్రికలలో ఉన్నవి. ఇన్‌ సైట్‌ ఆన్‌ది స్క్రిప్చ్‌ర్స్‌ అను ప్రచురణ “దైవభక్తిని” ఈ విధంగా స్పష్టీకరిస్తుంది. “పూజ్యభావము, ఆరాధన మరియు ఆయన విశ్వసార్వభౌమాధిపత్యమునకు యథార్థతతో దేవుని సేవ.” ఆయన ఔన్నత్యపు భీతి, నిత్యత్వము మరియు లెక్కలేని మహాసృష్టికార్యములవలన భక్తిసంభ్రమముతో గుణగ్రహణ చూపు మనుష్యులపై ఆయన వెదజల్లు ఆత్మీయ మరియు శారీరక వరములయెడల కృతజ్ఞతతో దేవుని దగ్గరకు వచ్చు హృదయమునుండి పూజ్యభావము ఉత్పన్నమగును. నిజముగా మనలో దైవభక్తిని వ్యక్తపరచు ప్రతి ఒక్కరము కీర్తన గ్రంథకర్త కీర్తన 104:1లో చెప్పినట్లు చెప్పగలము: “నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నాదేవా నీవు అధిక ఘనత వహించినవాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించియున్నావు.”

6. (ఎ) యెహోవా ఆరాధికులు క్రీస్తుమతసామ్రాజ్యమందలి చర్చి కుర్చీలలో కూర్చుండువారినుండి ఏ విధముగా వేరైయున్నారు? (బి) రోమీయులు 11:33, 34లో పౌలు ఏమిచెప్పెను, మరియు ఆ విధముగా ఏ ప్రశ్నలు ఉత్పన్నమవును?

6 దేవుని యెడల మన భక్తి బహిర్గతముకావలెను, మరియు ఇది కార్యముల ద్వారా జరుగును. ఈ విషయములో సత్యదేవుడైన యెహోవా ఆరాధికులకు, క్రీస్తుమతసామ్రాజ్యపు సన్నగిల్లుతున్న చర్చి కుర్చీలలో కూర్చుండువారికీ ఎంతో తేడా ఉంది. భూమిపైయున్న అనేకులకు మతము—ముఖ్యముగా ఇప్పటికిని మతమును కలిగియున్నవారికి—ఒకలాంఛనముగా ఉన్నది. తమ చుట్టు ఉన్న కుళ్లిన లోకమును అనుసరించు తమజీవన విధానాన్ని కప్పిపుచ్చుటకు వాడు అంగీవలె ఉన్నది. వారికి దేవుడు ఎవరు అనేది కూడా తెలియదు. నిశ్చయముగా అటువంటి వ్యక్తులు తమకు “తెలియబడని దేవునిని” ఆరాధించు ఏథెన్సువారలకు పౌలు అపొస్తలులకార్యములు 17:23లో చెప్పిన మాటలను గమనించవలసియున్నారు. అదేమనగా: “కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.” ఆ మహోన్నతమైన దేవునిగూర్చి పౌలు రోమా 11:33-34లో యిలా చెప్పెను: “ఆహా దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. యెహోవా ‘మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు?’” అయితే దేవుని మార్గములను మనము ఏవిధముగా తెలిసికొనగలము? ‘దైవభక్తిని గూర్చిన పరిశుద్ధమర్మము’ విషయము తెలిసికొనుట ద్వారా. అయితే మనము దానినెట్లు చేయగలము?

7. “నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది” అని ఎందుకు చెప్పగలము?

7 మొదటి తిమోతి 3వ అధ్యాయములో పౌలు మొదట వివరిస్తూ దేవుని గృహపరివారములో లేక 15వ వచనము వివరించిన రీతిగా “సత్యమునకు స్థంభమును ఆధారమునైయున్న జీవముగల దేవుని సంఘములో” బాధ్యతగల సేవకులు ఏమి చేయవలెనో తెలియజేయుచున్నాడు. పౌలు 16వ వచనములో ఇంకా చెపుతూ, “నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నదనెను.” అది గొప్పదైయున్నది, ఎందుకనగా యెహోవా తన అద్వితీయ కుమారుని, ఆ మర్మమును బయలుపరచి, దైవభక్తి నిజముగా ఏమైయున్నది, మరియు అది సత్యారాధనలో ఎంత అవశ్యకము మరియు ప్రాముఖ్యమైయున్నదో ప్రదర్శించుటకు పంపెను. ఈ దైవభక్తిని గూర్చిన పరిశుద్ధ మర్మము భూమిపై యేసు యొక్క జీవన విధానముద్వారా ప్రకాశితమాయెను. యెహోవాను ప్రేమించువారందరు దైవభక్తిని ఉదాహరించిన క్రీస్తుపై తమవిశ్వాసమును మరియు తమ జీవితములను కట్టవలెను. అయితే యేసు దైవభక్తిని గూర్చిన మర్మమును ఎట్లు స్పష్టీకరించెను?

ఆరు ముఖరూపములు

8. (ఎ) పౌలు 1 తిమోతి 3:16లో వర్ణించినట్లుగా పరిశుద్ధమర్మము యొక్క ఆరు ముఖరూపములేవి? (బి) ప్రత్యక్షుడయిన “ఆయన” ఎవరు?

8 దైవావేశమువలన పౌలు ఆ ప్రశ్నకు ఉత్తరమిచ్చుచున్నాడు. ఇచ్చట 1 తిమోతి 3:16లో ఆయన ఈ పరిశుద్ధమర్మముయొక్క ఆరు ముఖరూపములను వివరించుచున్నాడు: “ఆయన [1] సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, [2] ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను, [3] దేవదూతలకు కనబడెను, [4] (రక్షకుడని) జనములలో ప్రకటింపబడెను, [5] లోకమందు నమ్మబడెను, [6] ఆరోహణుడై తేజోమయుడయ్యెను.” ప్రత్యక్షుడైన “ఆయన” ఎవరైయున్నారు? స్పష్టముగా “ఆయన” వాగ్ధానము చేయబడిన సంతానమై, దేవునిచిత్తమును చేయుటకు వచ్చిన యేసుయైయున్నాడు. ఆయన ఆ పరిశుద్ధమర్మములో ప్రముఖుడై దానిని నిజముగా గొప్పదిగా చేయుచున్నాడు.

9. మొదటి తిమోతి 3:16లో “దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను” అని చదువబడకూడదనుటకు ఏమి రుజువుకలదు?

9 మొదటి తిమోతి 3:16లో చెప్పబడిన “ఆయన” స్వయముగా దేవుడేయని చెపుతూ త్రిత్వవాదులు, ఈ పరిశుద్ధమర్మముయొక్క అర్థములో గలిబిలి కలిగించుటకు ప్రయత్నించుచున్నారు. ఇందుకు “దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడాయెను” అని చదువబడు కింగ్‌జేమ్సు బైబిలుపై వారు ఆధారపడుదురు. అయితే నమ్మదగిన గ్రీకు మూలలేఖనములు ఏమి చెప్పుచున్నవి? ఏకరీతిగా ఆ “దేవుడు”కు బదులుగా “ఆయన” అను సర్వనామమును వాడుచున్నవి. ఈ లేఖనములో “దేవుడు” అని మార్చి వ్రాయుట లేఖికుల పొరపాటు అని నేటిలేఖనా విమర్శకులు ఒప్పుకొనుచున్నారు. కావున ఇటీవలి తర్జుమాలైన అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌, ది న్యూఇంగ్లీషు బైబిల్‌ మరియు న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌, ‘ఆయన [లేక, వచ్చిన ఆయన] సశరీరుడుగా ప్రత్యక్షుడాయెను’ అని సరిగ్గా వ్రాసినవి. లేదు, దేవుడు తానే “శరీరధారుడై” కనిపించలేదు. గాని, ఆయన ప్రియకుమారుడును మరియు మొదటి సృష్టియైన వాడు అలా కనిపించెను. ఆయననుగూర్చి అపొస్తలుడైన యోహాను యిలా వ్రాసెను: “ఆ వాక్యము శరీరధారియై కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె ఆయన మహిమను కనుగొంటిమి.”—యోహాను 1:14.

“సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను”

10. (ఎ) యేసు బాప్తిస్మమందు పరిశుద్ధ మర్మముయొక్క మొదటి భాగము ఎట్లు స్పష్టమాయెను? (బి) ఎందుకు యేసు “కడపటి ఆదాము” ఆయెను?

10 యేసు బాప్తిస్మమందు ఆ పరిశుద్ధమర్మము యొక్క మొదటి భాగము స్పష్టమాయెను. యేసు, అభిషక్తుడైన దేవుని కుమారుడై “సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.” యేసు శరీరధారుడైన ఒక పరిపూర్ణ మానవుడుగా జన్మించునట్లు యెహోవా దేవుడు తనకుమారుని జీవితమును పరలోకము నుండి మరియ గర్భములోనికి మార్చెను. అందుకే 1 కొరింథీయులు 15:45-47 చూపిన రీతిగా యేసు రెండవ లేక “కడపటి” ఆదాము ఆయెను; మొదటి ఆదామునకు ఖచ్చితముగా సరిపడు పరిపూర్ణ మానవ ఆత్మ. ఏ సంకల్పము కొరకు? మొదటి తిమోతి 2:5, 6 “కడపటి ఆదాము”ను గూర్చి “ఆయన యేసుక్రీస్తను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను,” అని సూచించెను. చట్టబద్ధమైన ఈ పరిపూర్ణ మానవ బలిపై ఆధారపడి తన రాజ్యములో సహావారసులు కానున్న 1,44,000 మనుష్యులతోచేసిన క్రొత్త నిబంధనకు యేసు మధ్యవర్తియైయుండెను.—ప్రకటన 14:1-3.

11. యేసు యొక్క విమోచనాబలి ప్రయోజనములు ఎవరికి విస్తరింపబడును?

11 యేసు యొక్క బలియాగ మరణముద్వారా ఇతరులుకూడా లాభముపొందుదురా? నిశ్చయముగా అవును! మొదటి యోహాను 2:2 చెప్పునదేమనగా యేసుక్రీస్తు “మన పాపములకు శాంతికరమైయున్నాడు. [యోహానువంటి అభిషక్త క్రైస్తవుల పాపములకు] మన పాపములకే కాదు సర్వలోకమునకు శాంతికరమైయున్నాడు.” ఆ విధముగా యేసుయొక్క విమోచనాబలి ప్రయోజనము 1,44,000 అభిషక్త క్రైస్తవులకే కాక సర్వలోకములోని మానవజాతి అంతటికి ప్రయోజనకరమైయున్నది. ఇప్పుడు జీవించియున్న “గొప్పసమూహము” మరియు పరదైసు భూమిలోనికి పునరుత్థానము కానున్న వందల కోట్లమంది, యేసుయొక్క విమోచనా బలిపై వారి విశ్వాసమును బట్టి నిత్యజీవమును పొందనైయున్నారు. ఇప్పుడు ప్రకటన 7:9, 10లో ప్రవచించిన రీతిగా ఒక గొప్పసమూహము, గొఱ్ఱెపిల్లయగు యేసుక్రీస్తు ధారపోసిన రక్తముపై విశ్వసించుట ద్వారా తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసికొన్నారు. వారు దేవుని స్నేహితులవలె నీతిమంతులుగా ఎంచబడ్డారు. వారు సంతోషముతో ఈ పరిశుద్ధ మర్మములోని వేరు వేరు రూపములు తెలిసికొని యేసు మాదిరిని అనుసరించి దైవభక్తిని ప్రదర్శింతురు.

ఇతర ముఖరూపములు

12. యేసు ఎట్లు “ఆత్మవిషయములో నీతిమంతుడని” నిరూపించబడెను?

12 మొదటి తిమోతి 3:16లోని రెండవభాగము విషయమే మి? “యేసు ఆత్మ విషయములో నీతిమంతుడని తీర్పుపొందెను.” కాని ఎట్లు? యెహోవా తన యథార్థత చూపించు కుమారున్ని మరణమునుండి ఆత్మీయ జీవమునకు లేపుట ద్వారా. ఇది చేయుట ద్వారా యేసు నీతిమంతుడని, మరి ఇతర ఉన్నత కార్యములు చేయుటకు అర్హుడని దేవుడు ప్రకటించెను. రోమీయులు 1:4 చెప్పిన రీతిగా యేసు “మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను నిరూపింపబడెను.” దీన్ని బలపరుస్తూ పేతురు తన మొదటి పత్రిక 3 వ అధ్యాయము 18వ వచనములో మనకు ఇలా చెపుతున్నాడు: “ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.” దైవభక్తి విషయములో యేసు ఉదాహరణ మిమ్ములను దేవుని యొద్దకు తెచ్చుచున్నదా?

13. పునరుత్థానుడైన యేసు ఏ దూతలకు కనిపించెను, మరియు ఎటువంటి సందేశమును ఆయన వారికి ప్రకటించెను?

13 మొదటి తిమోతి 3:16లో కొనసాగుతూ పౌలు మర్మములోని మూడవ భాగము విషయము “యేసు దేవదూతలకు కనపడెను” అని చెప్పెను. ఈ దూతలు ఎవరైయుండవచ్చు? 1 పేతురు 3:19, 20లో ఇలా చెప్పుచున్నాడు: “దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినపుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లివారికి ప్రకటించెను.” యూదా 6 ప్రకారంగా ఈ ఆత్మలు పరలోకంలో “తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలై” యున్నారు. వారు స్త్రీలతో చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధములను అనుభవించుటకు భౌతిక శరీరములను ధరించుకొనిరి. జలప్రళయము వలన ఆ దూతలు ఆత్మీయ సామ్రాజ్యమునకు బలవంతముగా తిరిగి వెళ్లవలసివచ్చినప్పుడు వారు టార్టారసు అను నీచమైన అయోగ్యస్థితిలో పడద్రోయబడిరి. (2 పేతురు 2:4) పునరుత్థానము పొందిన యేసు వారికి ప్రకటించెను. అది రక్షణను గూర్చిన సందేశమా? నిశ్చయముగా కాదు! కాని వారి దుష్టత్వము దైవభక్తికి విరోధమైనదని యేసు ఖండించెను. దేవుని ప్రజలలో ఎవరైనను లైంగిక అనైతికతతో ఆడుచున్నట్లయిన, ఆ దూతలపై ప్రకటించబడిన న్యాయతీర్పును ఒక హెచ్చరికగా ఎంచవలెను.

14. యేసు “జనములయందు ప్రకటించబడుట” ఎట్లు మొదలాయెను?

14 మొదటి తిమోతి 3:16లో నాలుగవ భాగమేమనగా “యేసు లోకములో ప్రకటించబడెను.” ఇది ఏవిధముగా నెరవేరెను? తానుబంధించబడు కొద్దిసమయము ముందు, యేసు తన అపొస్తలులతో ఇట్లు చెప్పెను: “నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయుక్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటె మరిగొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (యోహాను 14:12) ఆపై కొద్దిసమయము గడిచిన తరువాత సా.శ. 33 పెంతెకొస్తునాడు యేసు తన శిష్యులపై పరిశుద్ధాత్మను క్రుమ్మరించెను. మరియు “ఈ యేసును దేవుడు లేపెను” అను ఆశ్చర్యకరమైన వార్త యూదులలో ప్రకటింపబడుట మొదలాయెను. తరువాత సమరయులును దేవుని వాక్యమునంగీకరించి పరిశుద్ధాత్మను పొంద మొదలిడిరి. (అ.కార్యములు 2:32; 8:14-17) అటుతరువాత సా.శ. 36లో పేతురు, కొర్నేలి మరియు అతని ఇరొట్ల కూడికొనియున్న ఇతర అన్యులకు ప్రకటించెను. ఆ విధముగా యేసునుగూర్చిన సువార్త “జనములలో ప్రకటింప” బడుట మొదలాయెను. అనగా యూదులు కాని వారిలోను ప్రకటింపబడెను. మరి వీరును పరిశుద్ధాత్మచేత అభిషేకించబడిరి.

15. మొదటి-శతాబ్దపు క్రైస్తవులు దైవభక్తిని గూర్చిన మర్మమును బాగుగా నేర్చుకొనిరనుటకు రుజువు ఏది?

15 అపొస్తలుల కార్యములు 12:24 తెలిపినట్లు “దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.” అపొస్తలుల కార్యములు 17:6 ప్రకారంగా ఉత్తర గ్రీసులోని విరోధులు ఈ దినము వరకు చేయుచున్నరీతిగా, ఇలా కేకలు వేసారు: “భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చియున్నారు.” 30 సంవత్సరముల లోపునే పౌలు రోమా నుండి వ్రాస్తూ “ఈ సువార్త ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడియున్నది,” అని చెప్పగలిగెను. (కొలొస్సయులు 1:23) ఆ సమయములోని క్రైస్తవులు దైవభక్తిని గూర్చిన మర్మమును బాగుగా తెలిసికొనిరి. వారు దానిని ఎంత ఆసక్తితో అనువర్తించుచుండిరి! అదేవిధముగా మనము కూడా దానిని గూర్చి నేర్చుకొని, ఈ రాజ్యసువార్త ప్రకటించుపని ముగింపుకు వస్తున్న ఈ సమయములో దానిని మన జీవితములలో అనువర్తించెదము గాక!

16. పరిశుద్ధమర్మముయొక్క అయిదవ భాగమేమి, మరియు ఏ కార్యము దానిని స్పష్టపరచెను?

16 మొదటి శతాబ్దములో జరిగిన ఆ ప్రచారమునకు ప్రత్యుత్తరముగా 1 తిమోతి 3:16లోని పరిశుద్ధమర్మము యొక్క అయిదవ భాగము స్పష్టమాయెను. యేసు ఇప్పుడు “లోకమందు నమ్మబడెను.” పౌలు మరియు తిమోతివంటి ఆసక్తిగల మిషనరీలు దైవభక్తి ప్రదర్శించుటవలన ఇది జరిగెను. వారు సువార్తను ఆసియా మైనర్‌, ఐరోపా బహుశా, స్పెయిన్‌ అంతదూరం తీసికొని పొయ్యారు. మరియు బాప్తిస్మముపొందిన ఐతియోపీయునిద్వారా తూర్పు ఆఫ్రికా వరకు సువార్త ప్రకటింపబడగా అదేసమయములో పేతురు బబులోనులో సేవచేసెను.

17. ఆధునిక లోకమంతట యేసు ఎందుకు నమ్మబడుచున్నాడు?

17 మన దినము విషయమేమి? 1919 నుండి అభిషక్త శేషము మాదిరికరమైన దైవభక్తిని ప్రదర్శించుచున్నారు. యేసు వేసిన విశ్వాసమను పునాదిపై ఈ అభిషక్తులు దృఢముగా కట్టబడిరి. ప్రాముఖ్యముగా 1935 నుండి రానైయున్న “మహాశ్రమల” నుండి తప్పించుకొని పరదైసు భూమిపై నిత్యజీవమును అనుభవించు ఉత్తరాపేక్షను బట్టి ఉల్లసించుచున్న ఒక గొప్ప సమూహమును వీరు పోగుచేయుచున్నారు. (ప్రకటన 7:9, 14) ఆ విధముగా యేసుపై కేంద్రీకరించబడిన సువార్త ఆధునిక లోకమంతటా నమ్మబడుచున్నది. దైవభక్తితో 37,00,000 కంటే ఎక్కువమంది యెహోవా సాక్షులు భూమండలమంతా ప్రకటిస్తూ వర్ధిల్లుచున్నారు!

18. ఏవిధముగా యేసు “ఆరోహణుడై తేజోమయుడయ్యెను”?

18 పరిశుద్ధమర్మములోని ఆరవభాగము మిగిలింది: యేసు “ఆరోహణుడై తేజోమయుడయ్యెను.” ఆత్మసంబంధముగా సజీవుడైన తరువాత 40 రోజులు యేసు భౌతిక శరీరమును ధరించుకొని తన శిష్యులకు కనిపించి “దేవుని రాజ్యవిషయములను గూర్చి బోధించెను.” తరువాత ఆయన పరలోకమునకెక్కి పోయెను. (అ.కార్యములు 1:3, 6-9) యోహాను 17:1-5లో వ్రాయబడినట్లు ఆయన ప్రార్థనకు ఇలా జవాబు దొరికింది: “తండ్రీ. . .నీ కుమారుడు నిన్ను మహిమ పరచునట్లు నీ కుమారుని మహిమ పరుచుము. . .భూమిమీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రీ లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము.”

19. యేసు పరలోకమునకు తిరిగి వెళ్లినపుడు ఏమి జరిగియుండవచ్చును?

19 యేసు తిరిగి పరలోకమునకు వెళ్లినపుడు అది ఎంతగొప్ప సంతోషమును కలగ జేసియుండును! చాలా కాలము ముందు యెహోవా భూమిని స్థాపించినపుడు “దేవుని కుమారులందరును ఆనందించి జయధ్వనులు చేసిరి.” (యోబు 38:7) యెహోవా సార్వభౌమాధిపత్యమును జయింపజేసిన నమ్మకస్థుణ్ణి తమ మధ్యలోనికి తిరిగి స్వీకరించుటకు ఆ దూతల సమూహములు అత్యానందమును పొందియుండవచ్చును!

20. యేసు అంతటి శ్రేష్టమైన నామమును ఎందుకు పొందెను, మరియు ఆయన భూమిపై ఉన్నపుడు ఏమిచేసెను?

20 పౌలు జయించిన యేసును గూర్చి హెబ్రీయులకు 1:3, 4లో ఇట్లు చెప్పెను: “పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్టుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను.” అవినీతిని జయించినందుకు క్రీస్తు ఆ నామమును పొందెను. దేవుని కుమారుడు భూమిపై నిత్యజీవము పొందగోరు వారందరికి ఒక మాదిరి నిచ్చి, దైవభక్తి చూపుటలో ఒక ప్రకాశమానమైన మార్గమును ఏర్పరచెను. యేసు పరలోకములో దేవుని కుడి పార్శ్వమునకు ఎత్తబడినప్పుడు దైవభక్తిని గూర్చిన ఆ పరిశుద్ధ మర్మము అన్ని భాగములలో బయలు పరచబడెను. (w90 1⁄15)

మీరు ఎట్లు ప్రత్యుత్తరమిచ్చెదరు?

◻ “దైవభక్తి” అనగా ఏమి?

◻ యేసు ఎట్లు “సశరీరుడుగా ప్రత్యక్షమై” అటుతరువాత “ఆత్మవిషయములో నీతిపరుడని తీర్పుపొందెను”?

◻ ఏ దూతలకు యేసు కనపడెను, మరియు ఏ సందేశమును అందించెను?

◻ ఏ విధముగా క్రీస్తు “లోకములో ప్రకటించబడి నమ్మబడెను”?

◻ యేసు ఎప్పుడు “ఆరోహణుడై తేజోమయుడయ్యెను” మరియు దైవభక్తి విషయంలో ఆయన ఏమిచేసిన తరువాత?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి