కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 5/1 పేజీలు 3-4
  • కుటుంబమును ఏది వ్యాకులపరచు చున్నది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబమును ఏది వ్యాకులపరచు చున్నది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబ వ్యాకులతకు కొన్నికారణములు
  • కుటుంబ దురవస్థ—మన కాలానికి ఒక విలక్షణమైన సూచన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • కుటుంబ సంతోషానికి రహస్యమేదైనా ఉందా?
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • మీ కుటుంబ జీవితములో దేవునికి ప్రథమ స్థానమివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ‘బాధ కలుగునప్పుడు యెహోవాయే మన ఆశ్రయదుర్గము’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 5/1 పేజీలు 3-4

కుటుంబమును ఏది వ్యాకులపరచు చున్నది?

‘ఆమె సోమరి! ఒక ఘోరమైన గృహిణి!’ అని బాబ్‌ అరిచాడు.

‘అది ఎంతమాత్రం నిజం కాదు!’ అని జీన్‌ ప్రతినింద వేసింది. ‘నేను చేయుటకు ప్రయత్నించు ఒక్కదానినీ అతడు మెచ్చుకోడు. నేను పరిచయము కలిగియున్న వారందరిలో అతడు అత్యంత క్లిష్టమైన మనిషి.’

బాబ్‌ మరియు జీన్‌యొక్క జీవితములో ఏమిటి లోపము?a స్వల్ప అనుభవము కలిగిన వారి వివాహము కేవలము నాలుగునెలల ప్రాయము గలిగినదే, అయితే అది యిప్పటికే చిన్నాభిన్నమగుటకు సమీపముగా ఉన్నది. అయినను వారి సంగతి ఏమంత అసాధారణమైనది కాదు, వివాహవిచ్ఛిన్నములు సర్వసాధారణమని గణాంక వివరములు చూపుచున్నవి. యునైటెడ్‌ స్టేట్స్‌లో జరిగిన క్రొత్త వివాహములన్నింటిలో సగము విడాకులతో అంతమొందుచున్నవని నిపుణులు యిప్పుడనుచున్నారు. ఆలాగే అనేక యితర దేశములనుండికూడ అట్టి వ్యాకులమైన గణాంకములు వచ్చుచున్నవి. అయితే, విడాకులనేది దీనిలో ఒక పాత్రగా ఉన్నది. వివిధ కారణములచే అపూర్వమైన సంఖ్యలో, కుటుంబములు అగచాట్లుపడుచున్నవి.

కుటుంబ వ్యాకులతకు కొన్నికారణములు

కుటుంబములో వ్యాకులపరచు పరిస్థితులున్నప్పుడు పిల్లలు బహుగా ప్రభావితులగుచున్నారు. న్యూస్‌వీక్‌ పత్రిక యిలా నివేదించుచున్నది: “గత దశాబ్దములో [యునైటెడ్‌ స్టేట్స్‌నందు] జన్మించిన పిల్లలలో మూడవవంతు తాము 18వ సంవత్సరమునకు వచ్చే ముందుగా బహుశః మారుడు కుటుంబములలో జీవిస్తారు. నేడు ప్రతి నలుగురు పిల్లలలో ఒకరు తలిదండ్రులలో ఏ ఒకరిచేతనో పెంచబడుచున్నారు. నేడు పిల్లలలో 22 శాతం మంది వివాహబంధములేని వారికి పుట్టినవారే; వారిలో మూడవ వంతు 19 సంవత్సరములలోపు వయస్సున్న తల్లికి పుట్టినవారే.”

కుటుంబ వ్యాకులతకు సంబంధించిన కారణము నొకదానిని పేర్కొనుచు, పిల్లల-దురాచార సంబంధిత నిపుణుడు జె. పేట్రిక్‌ గేనన్‌ ఇట్లనెను: “దౌర్జన్యము, దుష్కామము, లేదా మత్తుపానీయములచేత భావోద్రేక దురాచారములకు పాల్పడుట ప్రతిదిన చర్యలైయున్న చోట అసాధారణముగా నడిపించబడుచున్న కుటుంబములలో లక్షలాదిమంది పెరుగుచున్నట్లు యిటీవలి పరిశీలనలు చూపుచున్నవి” అట్టివాటికి గురైన అనేకమంది పిల్లలకు, పెద్దవారివలె కుటుంబ వ్యాకులతను ఎలా తొలగించుకొనవచ్చునో తెలియకున్నదనుటలో ఆశ్చర్యము లేదు.

పారిశ్రామిక దేశాలలో ప్రాకిపోయిన ఆర్ధిక, సామాజిక, నైతికమార్పులు కుటుంబ వ్యాకులతకు కారణమని కొందరు పరిశీలకులు నిందవేయవచ్చును. ఉదాహరణకు, అనేకమంది స్త్రీలు శ్రామిక వర్గములో ప్రవేశించినందున, గృహ కర్తవ్యముల, బాధ్యతలనుగూర్చిన కలతచెందించు పునర్‌వ్యవస్థీకరణ తరచు తలెత్తబడుచున్నది. తల్లులు వర్ణవిహీనమైన ఉద్యోగ నైపుణ్యములకు గట్టి కృషిసల్పుచున్నారు, తండ్రులు యింటి పనులతో నిర్లక్ష్యంగా పెనుగులాడుచున్నారు, పిల్లలు సంరక్షణ కేంద్రములందలి జీవితమును కన్నీటితో సరిపుచ్చుకొనుచున్నారు.

భూగోళమందంతటానున్న దేశాలలో అనేక కుటుంబములు అధిక వత్తిడికి లోనగుచున్నారు. ఉద్యోగియైన వివాహిత దీనిని “తదేకంగా కొనసాగుచున్న అత్యవసర పరిస్థితిలో జీవించుటతో” పోల్చెను. ‘అమెరికాకు చెందిన కుటుంబము 10 సంవత్సరముల క్రితం ఉన్నదానికన్నా నేడు మరీహీనమై పోయిందని’ చెప్పి యిటీవల పరిశోధనలో ఓటుచేసిన వారు దాదాపు సగంమంది ఉన్నారనుట ఆశ్చర్యం కాదు; ఈ పరిస్థితి మెరుగుపడునని కొందరు మాత్రమే నమ్మారు.

అందుచేత, దూరదర్శిని మరియు రేడియోప్రసంగ ప్రదర్శనలతో కుటుంబ సంక్షోభమనునది నిరంతరం చర్చనీయాంశమైనది. కుటుంబ విధానమునుగూర్చి స్వయం సహాయక పుస్తకములను ప్రజలు మ్రింగివేస్తున్నారు, అందులో కొన్ని పుస్తకాలు కొంతమేరకు యోగ్యమైన, అభ్యాససిద్ధమైన సలహాను అందిస్తున్నవి, ‘మరింత స్వతంత్రంగా సంభాషించుకొనండి’ లేదా ‘ఒకరి భావాలను ఒకరు పంచుకోండి’ అనే సలహా సహాయకరమైనప్పటికిని గృహసమస్యల నిజమైన కారణమును అది చేపట్టలేకపోయింది. తదుపరి శీర్షిక ఆ విధంగాచేసి, కుటుంబ వ్యాకులతతో ఎలా వ్యవహరించాలో చూపును. (w91 5/15)

[అధస్సూచీలు]

a రహస్యతను కాపాడుటకు మారుపేర్లు వాడబడినవి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి