కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwbr20 అక్టోబరు పేజీలు 1-8
  • క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు
  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2020)
  • ఉపశీర్షికలు
  • అక్టోబరు 5-11
  • అక్టోబరు 12-18
  • అక్టోబరు 19-25
  • అక్టోబరు 26–నవంబరు 1
క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2020)
mwbr20 అక్టోబరు పేజీలు 1-8

క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

అక్టోబరు 5-11

దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 31-32

“విగ్రహపూజకు దూరంగా పారిపోండి”

w09 5/15 11వ పేజీ, 11వ పేరా

‘యెహోవా దినం సమీపించింది’ కాబట్టి పరిణతి సాధించేందుకు కృషి చేయండి’

11 లేఖనాల నుండి నేర్చుకున్న విషయాలను అన్వయించుకోవడం కష్టంగానే అనిపించవచ్చు. ప్రాముఖ్యంగా, పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు అలా అనిపించవచ్చు. ఉదాహరణకు, యెహోవా ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించిన కొంతకాలానికి, వారు ‘మోషేతో వాదిస్తూ యెహోవాను శోధిస్తూ’ వచ్చారు. ఎందుకు? తాగడానికి నీళ్లు లేవని వారలా చేశారు. (నిర్గ. 17:1-4) దేవునితో నిబంధన చేసుకొని, “యెహోవా చెప్పిన మాటలన్నిటి” ప్రకారం చేస్తామని ఒప్పుకొని రెండు నెలలైనా పూర్తికాకముందే వారు విగ్రహారాధన చేసి దేవుని నియమాన్ని ఉల్లంఘించారు. (నిర్గ. 24:3, 12-18; 32:1, 2, 7-9) మోషే హోరేబు కొండవద్ద నిర్దేశించబడుతున్నప్పుడు చాలా రోజులపాటు ఆయన వారి మధ్య లేకపోవడంవల్ల భయపడి వారలా చేశారా? గతంలో మోషే చేతికర్రను పైకెత్తి పట్టుకోవడంవల్ల వారు అమాలేకీయులతో జరిగిన యుద్ధంలో గెలిచారు. అమాలేకీయులు తమపై మళ్లీ దాడిచేయొచ్చనీ మోషే తమతో లేడు కాబట్టి తాము నిస్సహాయ స్థితిలో ఉన్నామనీ వారు అనుకున్నారా? (నిర్గ. 17:8-16) వారలా అనుకొనివుంటారు. ఏదేమైనా, వారు యెహోవాకు ‘లోబడలేదు.’ (అపొ. 7:39-41) వాగ్దానదేశంలోకి ప్రవేశించడానికి భయపడిన ఇశ్రాయేలీయులు ‘అవిధేయులయ్యారు.’ వారిలా అవిధేయులు కాకుండా ఉండేందుకు ‘జాగ్రత్తపడమని’ లేదా శాయశక్తులా కృషిచేయమని పౌలు క్రైస్తవులను ప్రోత్సహించాడు.—హెబ్రీ. 4:3, 11.

w12 10/15 25వ పేజీ, 12వ పేరా

దేవునికి లోబడండి, ఆయన చేసిన ప్రమాణాల నుండి ప్రయోజనం పొందండి

12 యెహోవా వెంటనే ధర్మశాస్త్ర నిబంధనలో తన వంతును నెరవేర్చడం మొదలుపెట్టాడు. ఆరాధన కోసం ఒక గుడారాన్ని, పాపులైన మానవులు తనను సమీపించేలా ఓ యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు. కానీ, ఇశ్రాయేలీయులు మాత్రం దేవునికి ఇచ్చిన మాటను త్వరగా మర్చిపోయారు, వాళ్లు “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి.” (కీర్త. 78:41) ఉదాహరణకు, మోషే సీనాయి పర్వతం మీద యెహోవా నుండి అదనపు నిర్దేశాలను తీసుకుంటున్న సమయంలో, మోషే తమను వదిలేసి వెళ్లిపోయాడని భావించిన ఇశ్రాయేలీయులు సహనం కోల్పోయారు, వాళ్లకు దేవునిపై ఉన్న విశ్వాసం కూడా తగ్గిపోవడం మొదలైంది. కాబట్టి, వాళ్లు ఒక బంగారు దూడను చేసుకొని, “ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే” అని చాటించారు. (నిర్గ. 32:1, 4) ఆ తర్వాత, వాళ్లు “యెహోవాకు పండుగ” చేసుకుంటున్నామని భావించి తాము చేసుకున్న విగ్రహానికి మొక్కారు, బలులు అర్పించారు. అది చూసినప్పుడు యెహోవా, ‘నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయారు’ అని మోషేతో అన్నాడు. (నిర్గ. 32:5, 6, 8) విచారకరంగా, అప్పటినుండి యెహోవాకు ప్రమాణాలు చేయడం, వాటిని నిలబెట్టుకోకపోవడం ఇశ్రాయేలీయులకు ఆనవాయితీగా మారిపోయింది.—సంఖ్యా. 30:2.

w18.07 20వ పేజీ, 14వ పేరా

“యెహోవా పక్షమున” ఎవరు ఉన్నారు?

14 విగ్రహాలను ఆరాధించడం తప్పని ఇశ్రాయేలీయులకు తెలుసు. (నిర్గ. 20:3-5) కానీ ఎంత త్వరగా బంగారు దూడను ఆరాధించడం మొదలుపెట్టారో కదా! వాళ్లు యెహోవా ఆజ్ఞను మీరినా, ఆయన ఇంకా వాళ్ల పక్షాన ఉన్నాడనుకొని ఇశ్రాయేలీయులు తమను తాము మోసం చేసుకున్నారు. అహరోను ఆ దూడ ఆరాధనను “యెహోవాకు పండుగ” అని కూడా పిలిచాడు. మరి యెహోవా ఏమి చేశాడు? ‘ప్రజలు చెడిపోయారని,’ ‘వాళ్లకు నియమించిన త్రోవనుండి తొలగిపోయారని’ యెహోవా మోషేతో చెప్పాడు. నిజానికి యెహోవాకు ఎంత కోపం వచ్చిందంటే, ఆ జనాంగమంతటినీ నాశనం చేయాలని ఆయన అనుకున్నాడు.—నిర్గ. 32:5-10.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

w19.12 3వ పేజీ, 4వ పేరా

పని చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ‘సమయం ఉంది’

4 యెహోవా, యేసు కష్టపడి పని చేశారంటే, దానర్థం మనం విశ్రాంతి తీసుకోకుండా పని చేయాలనా? ఎంతమాత్రం కాదు! యెహోవా ఎన్నడూ అలసిపోడు కాబట్టి ఆయనకు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ యెహోవా ఆకాశాన్ని, భూమిని చేసిన తర్వాత ‘విశ్రాంతి తీసుకుని, సేదదీరాడు’ అని బైబిలు చెప్తుంది. (నిర్గ. 31:17, NW) అంటే, యెహోవా తాను చేసిన పనిని చూసి ఆనందించడానికి సమయం తీసుకున్నాడని స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే యేసు భూమ్మీదున్నప్పుడు కష్టపడి పని చేశాడు. అంతేకాదు విశ్రాంతి తీసుకోవడానికి, స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి సమయం కూడా తీసుకున్నాడు.—మత్త. 14:13; లూకా 7:34

w87-E 9/1 29

పాఠకుల ప్రశ్న

ఒక వ్యక్తికి దేవుని ఆమోదం ఉండి, అతను ఆయన జ్ఞాపకంలో ఉంటే (“జీవగ్రంథంలో” పేరు ఉంటే) అతను ఖచ్చితంగా శాశ్వత జీవితం పొందుతాడని, అది ముందే నిర్ణయించబడిందని, ఇక దాంట్లో మార్పు ఉండదని కాదు. ఇశ్రాయేలీయుల గురించి మోషే ఇలా అడిగాడు: “ఇప్పుడు నీకిష్టమైతే వాళ్ల పాపాన్ని మన్నించు; లేకపోతే, నువ్వు రాసిన నీ పుస్తకంలో నుండి దయచేసి నా పేరు తుడిచేయి.” దానికి దేవుడు ఇలా అన్నాడు: “ఎవరైతే నాకు వ్యతిరేకంగా పాపం చేశారో అతని పేరునే నా పుస్తకంలో నుండి తుడిచేస్తాను.” (నిర్గమకాండం 32:32, 33) అవును, దేవుడు ఒక వ్యక్తిని ఆమోదించి అతని పేరును తన “గ్రంథంలో” రాశాక కూడా, ఆ వ్యక్తి అవిధేయత చూపించవచ్చు లేదా విశ్వాసాన్ని విడిచిపెట్టవచ్చు. అదే జరిగితే దేవుడు అతని పేరును జీవగ్రంథంలో నుండి తుడిచేస్తాడు.—ప్రకటన 3:5.

అక్టోబరు 12-18

దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 33-34

“యెహోవాకున్న ఆకర్షణీయమైన లక్షణాలు”

it-2-E 466-467

పేరు

సృష్టిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడని అర్థమౌతుంది, కానీ అది దేవుని పేరును తెలియజేయదు. (కీర్త 19:1; రోమా 1:20) దేవుని పేరును తెలుసుకోవడంలో ఆ పేరేంటో తెలిసుండడం మాత్రమే సరిపోదు. (2ది 6:33) నిజానికి, దేవుని వాక్యమైన బైబిల్లో వెల్లడైన విషయాల్ని అంటే ఆయన ఉద్దేశాలు, పనులు, లక్షణాలు గురించి కూడా తెలుసుకోవాలి. (1రా 8:41-43; 9:3,7; నెహె 9:10 పోల్చండి.) దీన్ని మోషే ఉదాహరణలో చూడవచ్చు, యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు నాకు పేరుతో తెలుసు” అంటే ఆయనకు మోషే గురించి బాగా తెలుసని అర్థం. (నిర్గ 33:12 అధస్సూచి) అలాగే, మోషేకు యెహోవా మహిమ, ఆయన ‘పేరు ప్రకటించబడడం’ చూసే గొప్ప అవకాశం దొరికింది. (నిర్గ 34:5) ఆ సందర్భంలో కేవలం యెహోవా పేరు ప్రకటించబడడమే కాదు ఆయన లక్షణాలు, పనులు గురించి కూడా ప్రకటించబడింది. “యెహోవా, యెహోవా, ఆయన కరుణ, కనికరం గల దేవుడు; ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు; ఆయన వేలమంది పట్ల విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు; తప్పుల్ని, అపరాధాల్ని, పాపాల్ని మన్నిస్తాడు; అయితే దోషిని శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు; మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి, మనవళ్ల మీదికి రప్పిస్తాడు.” (నిర్గ 34:6,7) అదేవిధంగా “నేను యెహోవా పేరును ప్రకటిస్తాను” అనే మాటలున్న మోషే పాటలో, యెహోవా ఇశ్రాయేలీయులతో వ్యవహరించిన విధానం గురించి అలాగే ఆయన వ్యక్తిత్వం గురించి చూస్తాం.—ద్వితీ 32:3-44.

w09 10/1 28వ పేజీ, 3-5 పేరాలు

యెహోవా తన లక్షణాల్ని వెల్లడిచేశాడు

యెహోవా మొట్టమొదటిగా తను “కనికరము, దయ” గల దేవుణ్ణని తెలియజేశాడు. (6వ వచనం) “కనికరం” అని అనువదించబడిన హెబ్రీ పదం, దేవుని “వాత్సల్యాన్ని” అంటే “ఒక తండ్రికి తన పిల్లలపట్ల ఉండేలాంటి వాత్సల్యాన్ని” సూచిస్తుందని ఒక బైబిలు పండితుడు చెప్పాడు. “దయ” అని అనువదించబడిన పదం, “అవసరంలోవున్న వ్యక్తికి సహాయం చేయడానికి ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా కదిలించబడడాన్ని వర్ణించే” క్రియాపదానికి సంబంధించినది. కాబట్టి, తమ పిల్లల అవసరాల విషయంలో ప్రేమతో శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రుల్లా తను తన ఆరాధకులపట్ల శ్రద్ధ తీసుకుంటాడన్న విషయం మనం తెలుసుకోవాలని యెహోవా ఆశిస్తున్నాడు.—కీర్తన 103:8, 13.

తర్వాత, తను “దీర్ఘశాంతము” గలవాడినని యెహోవా చెప్పాడు. (6వ వచనం) ఆయన భూమ్మీదున్న తన సేవకులమీద త్వరగా కోపం తెచ్చుకోడు. కానీ, ఆయన వాళ్లు అపరిపూర్ణతతో చేసే పొరపాట్లను క్షమిస్తూ తమ పాపభరిత నడవడిని మార్చుకోవడానికి వాళ్లకు సమయమిస్తూ వాళ్లపట్ల సహనం చూపిస్తున్నాడు.—2 పేతురు 3:9.

దేవుడు ఇంకా మాట్లాడుతూ, తను “విస్తారమైన కృపాసత్యములు” గలవాడినని చెప్పాడు. (6వ వచనం) కృప అనేది ఒక ఉత్తమ లక్షణం. యెహోవా ఈ లక్షణాన్ని చూపిస్తూ, తన సేవకులతో ఎన్నడూ తెగిపోని స్థిరమైన బంధాన్ని ఏర్పర్చుకుంటాడు. (ద్వితీయోపదేశకాండము 7:9) అంతేకాదు, యెహోవా సత్యానికి మూలం. ఆయన మోసం చేయడమనేది జరగని పని, అలాగే ఆయన మోసపోడు కూడా. ఆయన “సత్యదేవుడు” కాబట్టి, భవిష్యత్తు గురించి ఆయన చేసిన వాగ్దానాలతోసహా ఆయన చెప్పే ప్రతీవిషయాన్ని మనం పూర్తిగా నమ్మవచ్చు.—కీర్తన 31:5.

w09 10/1 28వ పేజీ, 6వ పేరా

యెహోవా తన లక్షణాల్ని వెల్లడిజేశాడు

మనం తన గురించి మరో ప్రాముఖ్యమైన సత్యం తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన “దోషమును అపరాధమును పాపమును” క్షమించే దేవుడు. (7వ వచనం) ఆయన పశ్చాత్తాపపడుతున్న పాపులను ‘క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.’ (కీర్తన 86:5) అదేసమయంలో, ఆయన చెడుతనాన్ని ఎన్నడూ సహించడు. ‘దోషులను నిర్దోషులుగా ఎంతమాత్రం ఎంచను’ అని కూడా ఆయన వివరించాడు. (7వ వచనం) కావాలని పాపాలు చేసేవాళ్లను పరిశుద్ధుడూ, న్యాయవంతుడూ అయిన దేవుడు శిక్షించకుండా వదిలిపెట్టడు. అలాంటివాళ్లు ఏదోకరోజు తమ పాపాలకు మూల్యం చెల్లించాల్సిందే.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

w04 3/15 27వ పేజీ, 5వ పేరా

నిర్గమకాండములోని ముఖ్యాంశాలు

33:11, 20—యెహోవా మోషేతో “ముఖాముఖిగా” ఎలా మాట్లాడాడు? ఈ పదం ఇరువైపుల నుండి జరిగే సన్నిహిత సంభాషణను సూచిస్తోంది. మోషే దేవుని ప్రతినిధితో మాట్లాడాడు, యెహోవా ఇచ్చిన సూచనలు అతని ద్వారానే మౌఖికంగా పొందాడు. అయితే ‘ఏ నరుడు దేవుణ్ణి చూసి బ్రతుకలేడు’ కాబట్టి మోషే యెహోవాను చూడలేదు. వాస్తవానికి యెహోవా మోషేతో వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ధర్మశాస్త్రం “మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను” అని గలతీయులు 3:19 చెబుతోంది.

w98 9/1 20వ పేజీ, 5వ పేరా

ప్రాముఖ్యమైన వాటికి ప్రథమస్థానం ఇవ్వండి!

ఇశ్రాయేలీయుల్లోని ప్రతి పురుషుడూ, యూదా మత ప్రవిష్టులైన ప్రతి ఒక్కరూ సంవత్సరంలో మూడుసార్లు యెహోవా సన్నిధికి వెళ్లాలి. అలాంటి సందర్భాల్లో కుటుంబమంతటికీ ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుందనే వాస్తవాన్ని గుర్తించి, అనేకమంది కుటుంబ శిరస్సులు తమ భార్యా పిల్లలను కూడా తమవెంట తీసుకెళ్లేవారు. అయితే కుటుంబమంతా అలా వెళ్లినప్పుడు శత్రు దాడి నుండి వారి ఇళ్లనూ పొలాలనూ ఎవరు కాపాడతారు? యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు.” (నిర్గమకాండము 34:24) తాము ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమ స్థానమిస్తే తమకు వస్తుసంబంధంగా ఎటువంటి నష్టమూ కలగదని నమ్మడానికి ఇశ్రాయేలీయులకు విశ్వాసం అవసరమైంది. యెహోవా తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడా? అవును, ఆయన కచ్చితంగా నిలుపుకున్నాడు!

అక్టోబరు 19-25

దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 35-36

“తన పని చేయడానికి యెహోవా మనల్ని సిద్ధం చేస్తున్నాడు”

w14 12/15 4వ పేజీ, 4వ పేరా

ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్లను యెహోవా సమృద్ధిగా దీవిస్తాడు

అయితే, స్వచ్ఛారాధనకు మద్దతుగా ప్రజలు తెచ్చిన కానుకలు కాదుగానీ, వాళ్లు ఇష్టపూర్వకంగా ఇవ్వడమే యెహోవాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. వాళ్లు తమ సమయాన్ని, శక్తిని కూడా ధారపోశారు. “వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికారు” అని లేఖనాలు చెబుతున్నాయి. నిజానికి, “ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి.” అంతేకాదు, యెహోవా బెసలేలుకు “విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును ప్రజ్ఞ వివేక జ్ఞానములు” ఇచ్చాడు. నిజానికి యెహోవా, తాను ఆజ్ఞాపించిన పనులన్నిటినీ చేయడానికి కావాల్సిన నైపుణ్యాన్ని బెసలేలుకు, అహోలీయాబుకు ఇచ్చాడు.—నిర్గ. 35:25, 26, 30-35.

w11 12/15 18వ పేజీ, 6వ పేరా

పరిశుద్ధాత్మతో నడిపించబడిన పూర్వకాల విశ్వాసులు

6 మోషే సమకాలీనుడైన బెసలేలు ఉదాహరణను పరిశీలిస్తే దేవుని పరిశుద్ధాత్మ ఇంకా ఏయే విధాలుగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. (నిర్గమకాండము 35:30-35 చదవండి.) గుడారానికి అవసరమైన వస్తువులను తయారుచేసే విషయంలో నాయకత్వం వహించే బాధ్యత బెసలేలుకు అప్పగించబడింది. ఈ పెద్ద పని చేపట్టే ముందు ఆయనకు అలాంటి పనిలో నైపుణ్యం ఉందా? ఉందేమో. కానీ, ఈ పనిని చేపట్టడానికి ముందు ఆయన ఐగుప్తీయుల కోసం ఇటుకలు తయారుచేసే పని చేసివుంటాడు. (నిర్గ. 1:13, 14) ఇంతకీ గుడారానికి సంబంధించి తనకు అప్పగించబడిన పనిని ఆయన ఎలా చేయగలిగాడు? ‘విచిత్రమైన పనులన్నిటిని చేయుటకు ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు’ యెహోవా బెసలేలులో తన ఆత్మను నింపాడు. అంతకుముందు బెసలేలుకు ఉన్న సామర్థ్యం పరిశుద్ధాత్మ శక్తి వల్ల మరింత పెరిగింది. అహోలీయాబుకు కూడా యెహోవా తన ఆత్మను ఇచ్చాడు. వాళ్లిద్దరూ పనిని చాలా బాగా నేర్చుకొని ఉంటారు, అందుకే వాళ్లు తమకు అప్పగించబడిన పనుల్ని నిర్వర్తించడమే కాక ఏమి చేయాలో ఇతరులకు కూడా నేర్పించారు. ఇతరులకు నేర్పించే సామర్థ్యాన్ని యెహోవాయే వాళ్లకు ఇచ్చాడు.

w11 12/15 19వ పేజీ, 7వ పేరా

పరిశుద్ధాత్మతో నడిపించబడిన పూర్వకాల విశ్వాసులు

7 బెసలేలు, అహోలీయాబుల మీద యెహోవా ఆత్మ పనిచేసిందనడానికి మరో రుజువు ఏమిటంటే, వాళ్లు తయారు చేసినవి ఎంతోకాలంపాటు అంటే దాదాపు 500 సంవత్సరాల తర్వాత కూడా ఉపయోగంలో ఉన్నాయి. (2 దిన. 1:2-6) ఆధునిక కాలంలో ప్రజలు ఏదైనా వస్తువును తయారు చేశారంటే, దానికి ఘనత అంతా తమకే రావాలని ఆశిస్తారు. కానీ బెసలేలు, అహోలీయాబులు అలా అనుకోలేదు. వాళ్లు సాధించినవాటికి ఘనత అంతా యెహోవాకే వెళ్లింది.—నిర్గ. 36:1, 2.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

w05 5/15 23వ పేజీ, 14వ పేరా

యెహోవా మార్గాలను తెలుసుకోవడం

14 ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమస్థానం ఇవ్వండి. ఇశ్రాయేలీయులు తమ ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ చూపలేనంతగా తమ భౌతిక అవసరాల్లో మునిగిపోకూడదు. కేవలం లోక సంబంధ విషయాలకే ఇశ్రాయేలీయుల జీవితాలు అంకితం కాకూడదు. యెహోవా ప్రతీవారం తాను పవిత్రమని పరిగణించే నిర్దేశిత సమయాన్ని కేటాయించాడు, ఆ సమయాన్ని సత్యదేవుని ఆరాధనా సంబంధ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి. (నిర్గమకాండము 35:1-3; సంఖ్యాకాండము 15:32-36) అదనంగా ప్రతీ సంవత్సరం, ప్రత్యేక పరిశుద్ధ సమావేశాలకు సమయం కేటాయించాలి. (లేవీయకాండము 23:4-44) ఇవి యెహోవా శూరకార్యాలను చర్చించుకోవడానికి, ఆయన మార్గాలను గుర్తుచేసుకోవడానికి, ఆయన చేసిన మేలంతటికీ కృతజ్ఞతలు చెల్లించేందుకు అవకాశాలను ఇస్తాయి. ప్రజలు యెహోవాపట్ల తమ భక్తిని ప్రదర్శించేకొద్దీ, వారు దేవుని భయంలోనూ ప్రేమలోనూ ఎదగడానికే కాక ఆయన మార్గాల్లో నడిచేందుకూ సహాయం పొందుతారు. (ద్వితీయోపదేశకాండము 10:12, 13) ఆ ఉపదేశాల్లో నిక్షిప్తమైన ఆరోగ్యకరమైన సూత్రాలు నేటి యెహోవా సేవకులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.—హెబ్రీయులు 10:24-25.

w00 11/1 29వ పేజీ, 1వ పేరా

ఔదార్య బాహుళ్యం ఆనందాన్ని తెస్తుంది

అప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా భావించివుంటారో ఒక్కసారి ఊహించండి. తరతరాలుగా వారు కఠోరమైన బానిస బ్రతుకును, తీవ్రమైన కొరతల్ని అనుభవించారు. కానీ ఇప్పుడు వారికి స్వేచ్ఛ లభించింది, వారి దగ్గర సిరిసంపదలూ ఉన్నాయి. ఆ సంపదల్లో కొంతభాగాన్ని తమతోపాటు తీసుకువెళ్ళడం గురించి వారు ఎలా భావించివుండవచ్చు? బహుశ తాము వాటిని సంపాదించుకున్నామనీ, వాటిని తీసుకువెళ్ళే హక్కు తమకు ఉందనీ వారు భావించివుండవచ్చు. అయితే, స్వచ్ఛారాధన మద్దతుకై ఆర్థికంగా తోడ్పడమని పిలువబడినప్పుడు వారు నిస్సంకోచంగా ఇచ్చారు, పిసినారితనంతో కాదు! ఆ సిరిసంపదలు తాము కలిగివుండేలా యెహోవాయే సాధ్యం చేశాడన్న విషయాన్ని వారు మర్చిపోలేదు. అందుకే, తమ దగ్గరున్న వెండినీ బంగారాన్నీ పశువుల్నీ సంపూర్ణంగా ఇచ్చారు. వారి ‘హృదయాలు వారిని ప్రేరేపించాయి.’ వారి ‘హృదయాలు వారిని రేపాయి.’ వారి ‘మనస్సులు వారిని ప్రేరేపించాయి.’ అది నిజంగా ‘యెహోవాకు మనఃపూర్వకంగా అర్పించిన అర్పణే.’—నిర్గమకాండము 25:1-9; 35:4-9, 20-29; 36:3-7.

అక్టోబరు 26–నవంబరు 1

దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 37-38

“ధూపవేదిక, బలిపీఠం—సత్యారాధనలో వాటికున్న పాత్ర”

it-1-E 82వ పేజీ, 3వ పేరా

బలిపీఠం

ధూపవేదిక. ధూపవేదిక కూడా (“బంగారు వేదిక” అని కూడా పిలవబడేది [నిర్గ 39:38]) తుమ్మ చెక్కతో తయారుచేయబడింది. దాని పైభాగం అలాగే నాలుగు పక్కల, బంగారు రేకు తొడిగించబడింది. దాని పైభాగం చుట్టూ బంగారు అంచు వేయబడింది. ఈ వేదిక పొడవు 44.5 సెంటీమీటర్లు (17.5 అంగుళాలు), ఎత్తు 89 సెంటీమీటర్లు (2.9 అడుగులు), దాని నాలుగు మూలల్లో నాలుగు “కొమ్ములు” కూడా ఉండేవి. బంగారు అంచు కింద, వేదిక ఇరువైపుల రెండు-రెండు బంగారు ఉంగరాలు తయారుచేశారు. ఈ ఉంగరాల గుండా బంగారు రేకుతో తొడిగించబడిన తుమ్మ చెక్క కర్రల్ని ఉంచేవాళ్లు. (నిర్గ 30:1-5; 37:25-28) ఈ వేదికపై ప్రత్యేక ధూపద్రవ్యాన్ని రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం కాల్చేవాళ్లు. (నిర్గ 30:7-9, 34-38) ధూపవేదిక దగ్గర ధూపపాత్రను వాడేవాళ్లని చెప్పవచ్చు, ఎందుకంటే ధూపం వేయడానికి ధూపపాత్రను లేదా నిప్పు పాత్రను ఉపయోగించారని బైబిల్లో కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. (లేవీ 16:12, 13; హెబ్రీ 9:4; ప్రక 8:5; 2ది 26:16, 19 పోల్చండి.) ధూపవేదిక గుడారంలోని అతి పవిత్ర స్థలం తెర ఎదురుగా ఉండేది కాబట్టి అది “సాక్ష్యపు మందసం ఎదురుగా పెట్టి” ఉందని బైబిల్లో చదువుతాం.—నిర్గ 30:1,6; 40:5, 26, 27.

it-1-E 1195

ధూపం

ఎడారిలో వాడిన పవిత్ర ధూపద్రవ్యాన్ని, ఇశ్రాయేలీయులు విరాళంగా ఇచ్చిన ఖరీదైన వాటితో తయారుచేయబడింది. (నిర్గ 25:1, 2,6; 35:4, 5, 8, 27-29) నాలుగు పదార్థాలతో తయారుచేయబడిన ఈ ధూపద్రవ్యం గురించి యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు జటామాంసి, గోపి చందనం, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి అనే పరిమళ ద్రవ్యాల్ని సమపాళ్లలో తీసుకొని, వాటితో ధూపద్రవ్యం తయారుచేయి. లేపనాలు తయారుచేసే వ్యక్తిలా వాటిని నేర్పుగా కలుపుతూ సువాసనగల ఆ మిశ్రమాన్ని తయారుచేయాలి. దానిలో ఉప్పు కూడా కలపాలి. అది స్వచ్ఛమైన, పవిత్రమైన ధూపద్రవ్యంగా ఉండాలి. నువ్వు దానిలో కొంచెం తీసుకొని, దాన్ని దంచి, మెత్తని పొడిగా చేయాలి. ఆ పొడిలో కొంచెం తీసుకొని ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్యపు మందసం ముందు, అంటే నేను నిన్ను కలుసుకునే చోట ఉంచాలి. అది మీకు అతి పవిత్రమైనదిగా ఉండాలి.” తర్వాత ఈ ధూపద్రవ్యం ఎంత ప్రత్యేకమైనదో, ఎంత పవిత్రమైందో తెలియజేయడానికి యెహోవా ఇలా కూడా అన్నాడు: “దాని సువాసనను ఆస్వాదించడానికి అలాంటిది చేసే ఏ వ్యక్తినైనా తన ప్రజల్లో ఉండకుండా కొట్టేయాలి.”—నిర్గ 30:34-38; 37:29.

it-1-E 82వ పేజీ, 1వ పేరా

బలిపీఠం

ధూపవేదిక, బలిపీఠం. గుడారం ఏర్పాటులో భాగంగా ఉన్న ధూపవేదిక అలాగే బలిపీఠం దేవుని నిర్దేశాలు ప్రకారం కట్టబడ్డాయి. దహనబలులు అర్పించే బలిపీఠం (దాన్ని “రాగి బలిపీఠం” అని కూడా పిలుస్తారు [నిర్గ 39:39]) తుమ్మ చెక్కతో తయారుచేయబడింది. బహుశా పైభాగం, కిందభాగం లేకుండా కేవలం నాలుగు పక్కలతో ఉండేలా దాన్ని చేసుంటారు. దాని పొడవు 2.2 మీటర్లు (7.3 అడుగులు), ఎత్తు 1.3 మీటర్లు (4.4 అడుగులు); దాని నాలుగు మూలల్లో కొమ్ములు తయారుచేయబడ్డాయి. బలిపీఠమంతా రాగి రేకుతో తొడిగించబడింది. బలిపీఠం అంచు “కింద” “లోపల మధ్యభాగం” దగ్గర ఒక రాగి జల్లెడ పెట్టబడింది. ఆ జల్లెడ నాలుగు మూలల్లో నాలుగు ఉంగరాలు ఉండేవి. బహుశా ఈ ఉంగరాల్లోకే రాగి రేకుతో తొడిగించిన తుమ్మ చెక్క కర్రల్ని పెట్టి ఉంటారు. ఆ జల్లెడను బలిపీఠంలోకి దూర్చడానికి బలిపీఠం రెండువైపుల రంధ్రాల్ని వేసి ఉండవచ్చు, దాని ఉంగరాలు బయటికి వేలాడుతుండవచ్చు. ఈ విషయం గురించి పండితులకు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, చాలామంది పండితులు మొత్తం ఎనిమిది ఉంగరాలు ఉన్నాయని చెప్తుంటారు. జల్లెడకు ఉన్న ఉంగరాలు కాకుండా కర్రల్ని పెట్టడానికి తయారుచేయబడిన ఉంగరాలు నేరుగా బలిపీఠానికే పెట్టబడ్డాయని అంటారు. నిప్పు పాత్రల్ని, బూడిదను తీసేయడానికి బాల్చీల్ని-పారల్ని, జంతువుల రక్తాన్ని సమకూర్చడానికి గిన్నెల్ని, మాంసాన్ని తీసుకోవడానికి ముళ్ల గరిటల్ని రాగితో తయారుచేశారు.—నిర్గ 27:1-8; 38:1-7, 30; సంఖ్య 4:14.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

it-1-E 36

తుమ్మ చెట్టు

తుమ్మ చెట్టుకున్న కొమ్మలు చాలా విస్తారంగా పెరుగుతాయి, వాటికి పెద్ద ముళ్లు ఉంటాయి. మామూలుగా ఈ చెట్టు కొమ్మలు పక్కనే ఉన్న వేరే తుమ్మ చెట్లతో అల్లుకుంటాయి; బహుశా అందుకే, ఈ చెట్టు గురించి బైబిల్లో ప్రస్తావించినప్పుడు బహువచనమైన షిటీమ్‌ అనే పదాన్ని ఎక్కువగా చూస్తాం. తుమ్మ చెట్టు 6-8 మీటర్ల (20-26 అడుగుల) ఎత్తు వరకు పెరగ్గలదు, కానీ అది పొదలా కనిపిస్తుంది. దాని ఆకులు మృదువుగా, పొడుగ్గా ఉంటాయి, దానికి చక్కని సువాసన ఉన్న పసుపు రంగు పువ్వులు పూస్తాయి, అలాగే దాని పండ్లు పొడుగ్గా వంపు తిరిగి ఉంటాయి. ఈ చెట్టు బెరడు గరుకుగా, నల్లగా ఉంటుంది. దాని లోపలున్న చెక్క గట్టిగా, బరువుగా ఉంటుంది. ఈ చెక్క నాణ్యమైనది, దానికి పురుగులు పట్టవు. ఈ గుణాల వల్ల అలాగే ఎడారిలో ఈ చెట్టు ఎక్కువగా అందుబాటులో ఉండడం వల్ల గుడారాన్ని, గుడారపు వస్తువుల్ని తయారుచేయడానికి తుమ్మ చెట్టును ఉపయోగించారు. ఒప్పంద మందసాన్ని (నిర్గ 25:10; 37:1), సముఖపు రొట్టెల కోసం బల్లను (నిర్గ 25:23; 37:10), ధూపవేదికను, బలిపీఠాన్ని (నిర్గ 27:1; 37:25; 38:1), వాటిని మోయడానికి కర్రల్ని (నిర్గ 25:13, 28; 27:6; 30:5; 37:4, 15, 28; 38:6), తెరల కోసం స్తంభాలను (నిర్గ 26:32, 37; 36:36), చట్రాలను (నిర్గ 26:15; 36:20) వాటి అడ్డకర్రల్ని (నిర్గ 26:26; 36:31) తుమ్మ చెక్కతోనే తయారుచేశారు.

w15 4/1 15వ పేజీ, 4వ పేరా

మీకు తెలుసా?

బైబిలు కాలంనాటి అద్దాలు, నేడు మనం ఉపయోగిస్తున్న వాటిలా ఉండేవి కావు. వాటిని సాధారణంగా బాగా మెరుగుపెట్టిన కంచు లోహంతో తయారుచేసేవాళ్లు. కానీ కొన్నిసార్లు రాగి, వెండి, బంగారం లేదా వాటి మిశ్రమాలతో కూడా అద్దాలను తయారుచేసుంటారు. బైబిల్లో ఇశ్రాయేలీయుల మొదటి ఆరాధన స్థలమైన గుడార నిర్మాణ సందర్భంలో అద్దాల గురించిన ప్రస్తావన మొదటిసారి కనిపిస్తుంది. రాగి గంగాళాన్ని అలాగే దాని పీఠాన్ని తయారుచేయడానికి స్త్రీలు అద్దాలను విరాళంగా ఇచ్చారు. (నిర్గమకాండం 38:8) బహుశా వాటిని తయారుచేయడం కోసం అద్దాలను కరిగించి ఉంటారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి