కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఈ రోజు
ఏప్రిల్‌
ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2026

బుధవారం, ఏప్రిల్‌ 29

“ఆలోచనా సామర్థ్యం నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది, వివేచన నీకు కాపుదలగా ఉంటుంది.”—సామె. 2:11.

పొద్దున లేచిన దగ్గర్నుండి, పడుకునే వరకు మనం చాలా నిర్ణయాలు తీసుకుంటాం. ఏం తినాలి, ఎప్పుడు పడుకోవాలి లాంటి కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటాం. మరోవైపు, కాస్త పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటాం. వాటివల్ల మన ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంతోషం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అలాగే యెహోవాను మనం ఎంత బాగా ఆరాధిస్తాం అనేది కూడా మన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఎంతైనా మన నిర్ణయాల వల్ల మనకు, మన కుటుంబానికి మంచే జరగాలని కోరుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన నిర్ణయాలు యెహోవాను సంతోషపెట్టాలని కూడా ఆశిస్తాం. (రోమా. 12:1, 2) మంచి నిర్ణయం తీసుకోవడానికి మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని, వాస్తవాల్ని తెలుసుకోవడం. ఇది ఎందుకు ప్రాముఖ్యం? ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. ఒక డాక్టర్‌ ఏదైనా పెద్ద జబ్బు వచ్చిన వ్యక్తికి చికిత్స ఎలా చేస్తాడు? రోగిని చూడకుండా లేదా అతన్ని ఏ ప్రశ్నలు అడగకుండానే చికిత్స మొదలుపెట్టేస్తాడా? లేదు కదా. మీరు కూడా ఆ మంచి డాక్టర్‌లాగే, పరిస్థితికి సంబంధించిన వాస్తవాలన్నిటినీ ముందు తెలుసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. w25.01 14 ¶1-3

ఏప్రిల్‌ 27–మే 3
క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026 | మార్చి

ఏప్రిల్‌ 27–మే 3

యెషయా 56-57

పాట 12, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. యెహోవా మన దేవుడు కాబట్టి సంతోషంగా ఉన్నాం

(10 నిమి.)

విగ్రహాల్ని పూజించేవాళ్లు సహాయం కోసం ఎంత ప్రార్థించినా ఎవ్వరూ వినరు (యెష 57:13; ip-2 269 ¶14-16)

యెహోవా ఎవరో తెలియనివాళ్ల పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది, వాళ్ల మధ్య ఐక్యత ఉండదు (యెష 57:20; w18.06 7 ¶16)

దుష్టులకు మనశ్శాంతి ఉండదు (యెష 57:21; w99 10/1 11 ¶4)

ఇద్దరు సిస్టర్స్‌ కలిసి సంతోషంగా పరిచర్య చేస్తున్నారు.

ఇలా ప్రశ్నించుకోండి: యెహోవాతో స్నేహం నాకెలా మేలు చేస్తుంది?

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యెష 56:6, 7—ఈ ప్రవచనం ఎలా నెరవేరుతుంది? (w07 1/15 10 ¶3; w06 11/1 27 ¶1)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) యెష 56:4-12 (th అధ్యాయం 5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. ఈమధ్య మీటింగ్‌లో మీరు నేర్చుకున్న ఒక విషయాన్ని చెప్పండి. (lmd పాఠం 2 పాయింట్‌ 4)

5. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రసంగం. ijwbq ఆర్టికల్‌ 90—అంశం: ఒక మతంలో సభ్యునిగా ఉండడం నిజంగా అవసరమా? (th అధ్యాయం 16)

6. శిష్యుల్ని చేసేటప్పుడు

(4 నిమి.) lff పాఠం 19 పాయింట్‌ 4 (lmd పాఠం 11 పాయింట్‌ 3)

మన క్రైస్తవ జీవితం

పాట 58

7. యెహోవా గురించి మాట్లాడడం ఎన్నడూ మానకండి

(15 నిమి.) చర్చ.

యెహోవా అంటే తెలియని వాళ్ల జీవితానికి ఒక అర్థం గానీ, భవిష్యత్తు మీద ఆశ గానీ ఉండదు. వాళ్లకు నమ్మదగిన సలహాలు ఇచ్చి, సరైన దారిలో నడిపించేవాళ్లు ఎవ్వరూ లేరు. పరిస్థితి ఇలా ఉన్నా చాలామంది, సత్యానికున్న విలువ తెలియక రాజ్య సందేశాన్ని వినడానికి ఇష్టపడట్లేదు. ప్రజలు విననప్పుడు మనం నిరుత్సాహపడకుండా, పరిచర్యలో వెనకడుగు వేయకుండా ఉండడానికి కింద ఇచ్చిన కారణాలు మనకు సహాయం చేస్తాయి.—ప్రస 11:6.

  • మన టెరిటరీలో ఉన్నవాళ్లు ఇల్లు మారవచ్చు. ఆసక్తి లేని ఇంటివ్యక్తులు ఇల్లు మారవచ్చు, కొత్తగా వచ్చినవాళ్లు వినడానికి ఇష్టపడవచ్చు

  • అంతకుముందు కలవనివాళ్లు ఈసారి కలవచ్చు. ఉదాహరణకు ఇంటివ్యక్తుల వృద్ధ తల్లిదండ్రుల్ని కలవచ్చు, ఇంతకుముందు కలిసిన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యుండవచ్చు, కొత్తగా వచ్చిన రూమ్‌మేట్స్‌ని కలవవచ్చు, లేదా ఇంటివాళ్లను పలకరించడానికి వచ్చిన గెస్ట్‌లను కలవవచ్చు

  • ప్రజలు మారతారు. (1తి 1:13) పరిస్థితులు మరీ ఘోరంగా తయారవ్వడం చూసినప్పుడు లేదా జీవితంలో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఇంటివ్యక్తి మనసు కరిగి, మనం చెప్పేది ఇప్పుడు వినడానికి ఇష్టపడవచ్చు

  • పట్టుదలగా ప్రీచింగ్‌ చేస్తూనే ఉంటే యెహోవా మీద మనకున్న ప్రేమను చూపిస్తాం.—లూకా 6:45; 1యో 5:3

“యెహోవా ‘ఏ ఒక్కరికీ దూరంగా లేడు’” వీడియోలోని సీన్‌. కెఫేలో ఒక సిస్టర్‌ ఒకామెకు కరపత్రం ఇస్తుంది.

యెహోవా “ఏ ఒక్కరికీ దూరంగా లేడు” వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • మానకుండా ప్రీచింగ్‌ చేస్తూనే ఉండడం గురించి మీరేం నేర్చుకున్నారు?

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) lfb లెసన్స్‌ 80-81

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 28, ప్రార్థన

విషయసూచిక
కావలికోట (అధ్యయన) (2026) | ఫిబ్రవరి

ఏప్రిల్‌ 27, 2026–మే 3, 2026 వారంలో జరిగే అధ్యయన ఆర్టికల్‌

20 బాప్తిస్మం తర్వాత వచ్చే సవాళ్లకు సిద్ధంగా ఉండండి

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి