కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • “ఇవి జరుగవలసియున్నవి”
    కావలికోట—1999 | మే 1
    • సమకాలీనులు దాన్ని చూస్తారు

      11. “ఈ తరము” గురించి యేసు ఏమి చెప్పాడు?

      11 ఆలయం కేంద్రంగా గల తమ ఆరాధనా విధానం నిరంతరం నిలుస్తుందని అనేకమంది యూదులు తలంచారు. అయితే యేసు ఇలా చెప్పాడు: “అంజూరపు చెట్టును చూచి . . . నేర్చుకొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యంక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.”(ఇటాలిక్కులు మావి.)—మత్తయి 24:32-35.

      12, 13. “ఈ తరము” అని యేసు చెప్పినదాన్ని ఆయన శిష్యులు ఎలా అర్థంచేసుకొని ఉంటారు?

      12 సా.శ. 66కు ముందున్న సంవత్సరాల్లో క్రైస్తవులు, సంయుక్త సూచనలోని ప్రారంభ భాగాలైన యుద్ధాలూ, కరువులూ, రాజ్య సువార్త విస్తృతంగా ప్రకటించబడడం వంటివాటిలో అనేకం నెరవేరడాన్ని చూసివుంటారు. (అపొస్తలుల కార్యములు 11:28; కొలొస్సయులు 1:23) అయితే, అంతం ఎప్పుడు వస్తుంది? ‘ఈ తరము [గ్రీకు, యెనెయా] గతింపదు’ అని యేసు చెప్పినప్పుడు ఆయన భావమేమై ఉంటుంది? యూదా మత నాయకులతోపాటు, వ్యతిరేకించిన సమకాలీన యూదా సమూహాల్ని యేసు తరచుగా “వ్యభిచారులైన చెడ్డ తరమువారు” అని పిలిచాడు. (మత్తయి 11:16; 12:39, 45; 16:4; 17:17; 23:36) కాబట్టి ఆయన ఒలీవ కొండపై మరలా ‘ఈ తరాన్ని’ గురించి మాట్లాడినప్పుడు, ఆ తరం చరిత్రయందంతటిలో ఉన్న యావత్‌ యూదా జాతి అన్నది ఆయన ఉద్దేశంకాదనీ లేక తన అనుచరులు ‘ఏర్పరచబడిన వంశము’నకు చెందినవారే అయినప్పటికీ వారు కాదనీ రుజువవుతుంది. (1 పేతురు 2:9) “ఈ తరము” కొంత నిడివిగల కాలమని కూడా యేసు చెప్పడంలేదు.

      13 బదులుగా, యేసు మనస్సులో ఉన్నది తాను తెలియజేసిన సూచన నెరవేర్పును చవిచూడబోయే ఆ కాలంనాటి వ్యతిరేకించిన యూదులే. లూకా 21:32లో ఉన్న “ఈ తరము” అన్న రిఫరెన్సు గురించి ప్రొఫెసర్‌ జోయల్‌ బి. గ్రీన్‌ ఇలా పేర్కొంటున్నారు: “మూడవ సువార్తలో ‘ఈ తరము’ (అలాగే దాని సంబంధిత పదబంధాలు), దేవుని సంకల్పాన్ని అడ్డగించే ప్రజలకు చెందిన ఒక వర్గాన్ని క్రమంగా సూచించింది. . . . దైవిక సంకల్పం విషయంలో మొండిగా తమ ముఖాలను త్రిప్పుకునే ప్రజలను [అది సూచిస్తుంది].”b

      14. ఆ “తరము” దేన్ని చవిచూసింది, క్రైస్తవులు ఏ విధంగా ఒక భిన్నమైన ప్రతిఫలాన్ని పొందారు?

      14 సూచన నెరవేరుతుండడాన్ని గమనించే యూదా వ్యతిరేకుల దుష్ట తరము, యూదా విధానాంతాన్ని కూడా చవిచూస్తుంది. (మత్తయి 24:6, 13, 14) వాళ్లు చవిచూశారు కూడా! సా.శ. 70లో వెస్పాసియన్‌ చక్రవర్తి కుమారుడైన టైటస్‌ నాయకత్వంలో రోమా సైన్యాలు తిరిగి వచ్చాయి. నగరంలోనే మరలా దిగ్బంధానికి గురైన యూదులు అనుభవించిన బాధ నమ్మశక్యంకానిది.c రోమన్లు ఆ నగరాన్ని నేలమట్టంచేసే నాటికి, దాదాపు 11,00,000 మంది యూదులు మరణించారు, దాదాపు లక్షమంది ఖైదీలుగా కొనిపోబడ్డారు, అటు తర్వాత వారిలో అనేకమంది ఆకలితో అలమటించో లేక రోమన్‌ థియేటర్లలోనో తమ ప్రాణాల్ని ఘోరంగా పోగొట్టుకున్నారని ప్రత్యక్షసాక్షి ఫ్లేవియస్‌ జోసీఫస్‌ నివేదిస్తున్నాడు. నిజంగా, సా.శ. 66-70 సంవత్సరాలలో వచ్చిన ఆ శ్రమ, యెరూషలేమూ, యూదా విధానమూ ఎన్నడూ అనుభవించనంత లేక ఇక ఎన్నడూ అనుభవించబోనంత గొప్పది. యేసు ప్రవచనాత్మక హెచ్చరికను లక్ష్యపెట్టి, సా.శ. 66లో రోమా సైన్యం వెనక్కి వెళ్లిపోయిన తర్వాత యెరూషలేమును విడిచివెళ్లిన క్రైస్తవులు ఎంత భిన్నమైన ప్రతిఫలం పొందారో కదా! ‘ఏర్పర్చబడిన’ అభిషిక్త క్రైస్తవులు సా.శ. 70లో ‘తప్పించబడ్డారు’ లేక సురక్షితంగా భద్రపర్చబడ్డారు.—మత్తయి 24:16, 22.

  • “ఇవి జరుగవలసియున్నవి”
    కావలికోట—1999 | మే 1
    • b బ్రిటిష్‌ పండితుడు జి. ఆర్‌. బీజ్లీమరీ ఇలా పేర్కొన్నారు: “‘ఈ తరము’ అన్న పదబందం, భాష్యకారులకు భాష్యంచెప్పడానికి కష్టమైన పదంకాకూడదు. నిజమే తొలి గ్రీకులో యెనెయా అంటే జన్మించడం, సంతతి అని అర్థం, కాబట్టి ఒకే మూల పురుషుని నుండి వచ్చిన సంతతి అనే భావంలో జాతి అని అర్థం, [గ్రీకు సెప్టాజింట్‌]లో వయస్సు, మానవజాతి వయస్సు, లేక సమకాలీనులు అనే భావంలో తరము అని అర్థంగల హెబ్రీ పదమైన దొర్‌ను అనువదించడానికి అది అతి తరచుగా ఉపయోగించబడింది. . . . యేసు చెప్పినవని చెప్పబడుతున్న మాటల్లో ఆ పదానికి రెండు విధాలైన భావం ఉన్నట్టు సూచిస్తుంది: ఒకవైపున అది ఎల్లప్పుడూ ఆయన సమకాలీనులను చూపిస్తుంది, మరోవైపున అది ఎల్లప్పుడూ నర్మగర్భితమైన విమర్శను సూచిస్తుంది.”

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి