సామెతలు
23 రాజుతో కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు
నీ పరిస్థితి గురించి జాగ్రత్తగా ఆలోచించుకో;
2 నువ్వు భోజనప్రియుడివైతే
నీ గొంతుకు కత్తి పెట్టుకో.*
3 అతని రుచిగల ఆహారపదార్థాల్ని ఆశించకు,
వాటిని చూసి మోసపోకు.
4 ఆస్తిని సంపాదించడానికి అతిగా ప్రయాసపడకు.+
కాస్త ఆగి, అవగాహన చూపించు.*
5 నీ చూపు దానిమీద పడగానే, అది లేకుండా పోతుంది;+
అది గద్దలా రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతుంది.+
6 పిసినారి ఆహారం తినకు;
అతని రుచిగల ఆహారపదార్థాల్ని ఆశించకు.
7 ఎందుకంటే అతను లెక్కలు చూసుకుంటాడు.
“తిను, తాగు” అని అతను నీతో అంటాడు, కానీ ఆ మాటలు మనసులో నుండి రావు.
8 నువ్వు తిన్న ముద్దల్ని కూడా కక్కేస్తావు,
నీ ప్రశంసలు వృథా అయిపోతాయి.
10 పురాతన సరిహద్దు రాయిని జరపకు,+
తండ్రిలేని వాళ్ల పొలంలోకి చొరబడకు.
12 క్రమశిక్షణ మీద మనసుపెట్టు,
జ్ఞాన వాక్కుల్ని చెవిపెట్టి విను.
13 బాలుడికి* క్రమశిక్షణ ఇవ్వకుండా ఉండకు.+
బెత్తంతో* కొడితే అతనేమీ చనిపోడు.
14 సమాధిలోకి* వెళ్లకుండా అతన్ని కాపాడాలంటే,
అతన్ని బెత్తంతో కొట్టాలి.
17 పాపుల్ని చూసి నీ హృదయాన్ని ఈర్ష్య పడనివ్వకు,+
బదులుగా రోజంతా యెహోవా పట్ల భయభక్తులు కలిగివుండు;+
18 అలాచేస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది,+
నీ ఆశ భంగం కాదు.
19 నా కుమారుడా, విని తెలివి సంపాదించు,
నీ హృదయాన్ని సరైన దారిలో నడిపించు.
20 ద్రాక్షారసం ఎక్కువగా తాగేవాళ్లతో,+
మాంసం అతిగా తినేవాళ్లతో సహవసించకు;+
21 ఎందుకంటే తాగుబోతులు, తిండిబోతులు పేదవాళ్లౌతారు,+
నిద్రమత్తు వల్ల చింపిరిగుడ్డలు వేసుకునే పరిస్థితి వస్తుంది.
24 నీతిమంతుని తండ్రి ఖచ్చితంగా సంతోషిస్తాడు;
తెలివిగలవాణ్ణి కన్న వ్యక్తి అతన్ని బట్టి ఆనందిస్తాడు.
25 నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు,
నిన్ను కన్న తల్లి ఆనందిస్తుంది.
26 నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు,
నా మార్గాలు నీ కళ్లకు ఆహ్లాదకరంగా ఉండాలి.+
28 ఆమె దోపిడీ దొంగలా కాపుకాస్తుంది;+
పురుషుల్లో నమ్మకద్రోహుల సంఖ్యను పెంచుతుంది.
29 ఎవరికి శ్రమ? ఎవరికి ఆందోళన?
ఎవరికి గొడవలు? ఎవరికి ఫిర్యాదులు?
ఎవరికి కారణం లేకుండా గాయాలు? ఎవరికి మసక చూపు?
31 గిన్నెలో తళతళలాడుతూ, తాగడానికి రుచిగా ఉండే
ద్రాక్షారసపు ఎర్రని రంగును చూడకు.
32 చివరికి అది పాములా కాటేస్తుంది,
విషసర్పంలా విషాన్ని వెళ్లగక్కుతుంది.
34 నువ్వు నడి సముద్రంలో పడుకున్న వాడిలా,
ఓడ కొయ్య అంచున పడుకున్న వాడిలా ఉంటావు.
35 నువ్వు ఇలా అనుకుంటావు: “వాళ్లు నన్ను కొట్టారు, కానీ నాకు తగల్లేదు.*
నా మీద దెబ్బలు పడ్డాయి కానీ ఆ విషయం నాకు గుర్తులేదు.
నేను నిద్రలేచినప్పుడు+
మళ్లీ తాగడానికి వెళ్తాను.”*