23 అయితే అందుకోసం మీరు మీ విశ్వాసాన్ని పునాది+ మీద స్థాపించుకుని, స్థిరంగా ఉంటూ+ అందులో కొనసాగాలి.+ అంతేకాదు, మీరు ఏ మంచివార్తనైతే విన్నారో, ఏ మంచివార్తయితే భూమంతటా ప్రకటించబడిందో+ ఆ మంచివార్త ఇచ్చిన నిరీక్షణ నుండి మీరు పక్కకు వెళ్లకూడదు. పౌలు అనే నేను ఆ మంచివార్తకే పరిచారకుణ్ణి అయ్యాను.